Rinku Singh International Career:టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రింకూ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి ఆదివారాని (ఆగస్టు 18)కి ఏడాది పూర్తయ్యింది. 2023 ఐపీఎల్‌లో ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన రింకూ అదే ఏడాది ఐర్లాండ్ పర్యటనకు ఎంపికై ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అయితే టీట్ఇండియా తరఫున డెబ్యూ మ్యాచ్ ఆడి ఏడాది పూర్తైన సందర్భంగా రింకూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.
బ్లా జెర్సీ (టీమ్ఇండియా)ధరించడంతో కల సాకారమైందంటూ అరంగేట్ర క్షణాలు గుర్తుచేసుకున్నాడు. తన డెబ్యూ క్యాప్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. 'నా కల నిజమై నేటికి సంవత్సరం పూర్తైంది. బ్లూ జెర్సీలో గడిపిన ప్రతిక్షణానికి కృతజ్ఞతలు. జై హింద్' అని పోస్ట్‌కు క్యాప్షన్ రాసుకొచ్చాడు.
శ్రీలంక సిరీస్‌లో రింకూ మాయ
గత నెలలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి కూడా రింకూ సింగ్ ఎంపికయ్యాడు. అయితే సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. చివరి మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో మాయ చేసి జట్టును రక్షించాడు. శ్రీలంక విజయానికి 12బంతుల్లో 9 పరుగులు కావాల్సిన దశలో రింకూ బౌలింగ్‌కు వచ్చాడు. తన అద్భుత బౌలింగ్‌తో చేజారిపోతుందనుకున్న మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. 19వ ఓవర్లలో కేవలం మూడు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అనంతరం కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా బంతితో మాయ చేశాడు. చివరి ఓవర్లో 5 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. స్కోర్లు సమయం అయ్యాయి. ఇక సూపర్ ఓవర్‌లో టీమ్ఇండియా విజయం సాధించింది. ఈ టీ20 సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసింది.
దులీప్ ట్రోఫీలో నో ఛాన్స్!
దులీప్ ట్రోఫీ 17వ ఎడిషన్ సెప్టెంబర్ 5న ప్రారంభం కానుంది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, శుభ్‌మాన్ గిల్ వంటి టీమ్ ఇండియా స్టార్లు ఈ టోర్నీలో ఆడనున్నారు. మొత్తం బీసీసీఐ 4 స్క్వాడ్‌లు ప్రకటించింది. ఏ జట్టులోనూ రింకూ సింగ్‌కు చోటు దక్కలేదు. అతడికి ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డులు ఉన్నప్పటికీ అవకాశం ఇవ్వకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.