Rinku Singh IPL Salary :చాలా మంది క్రికెటర్లు ఐపీఎల్‌లో రాణించి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెడుతుంటారు. ఈ జాబితాలో రింకూ సింగ్ (26) కూడా ఉన్నాడు. 2023 ఐపీఎల్ సీజన్‌లో యశ్ దయాల్ బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాది కోల్‌కతా నైట్ రైడర్స్‌ను గెలిపించడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తన హార్డ్ హిట్టింగ్‌తో చాలా మ్యాచ్‌లు గెలిపించాడు. బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు పొందిన రింకూకి టీమ్ ఇండియాలో కూడా చోటు దక్కింది.
రింకూ సింగ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున 7 సంవత్సరాలుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆడుతున్నాడు. కొన్ని సీజన్ల నుంచి కోల్‌కతా తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. భారత జట్టులోకి అడుగుపెట్టాక కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే ఇప్పటికీ కేకేఆర్ నుంచి రింకూ చాలా తక్కువ ఫీజును మాత్రమే పొందుతున్నాడు. తాజాగా దీనిపై అతడికి ఓ ప్రశ్న ఎదురవ్వగా కీలక కామెంట్స్ చేశాడు.
- వెనుకబడిన క్రికెటర్ల కోసం విరాళం
ప్రస్తుతం రింకూ కేకేఆర్ కీలక ప్లేయర్‌గా మారాడు. ప్రతి మ్యాచ్‌లో ఫినిషర్ పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే వెనకబడిన క్రికెటర్ల కోసం స్పోర్ట్స్ హాస్టల్ నిర్మించడానికి రూ.50 లక్షల రూపాయలు విరాళంగా కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా రింకూ సింగ్ ఐపీఎల్ సంపాదన చర్చకు వచ్చింది. టీ20 ఫార్మాట్‌లో భారతదేశంలోని అత్యుత్తమ ఫినిషర్స్‌లో ఒకడిగా రింకూ సింగ్ పేరు సంపాదించుకున్నాడు. అయినా అతను ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ నుంచి రూ.55 లక్షల జీతం మాత్రమే అందుకుంటున్నాడు. ఇతర ప్లేయర్‌లతో పోలిస్తే రింకూ తన స్థాయికి చాలా తక్కువ మొత్తం అందుకుంటున్నాడనే చెప్పాలి.
అయినా రూ.55 లక్షలతో తాను సంతృప్తిగానే ఉన్నట్లు రింకూ చెప్పాడు. "కేకేఆర్ నుంచి నాకు వచ్చే రూ.55 లక్షలతో నేను సంతోషంగా ఉన్నాను. ఇది చాలా ఎక్కువ డబ్బు." అని చెప్పాడు.
- ఐపీఎల్‌తో మారిన జీవితం