Rinku Singh Autograph: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రింకూ సింగ్ 2024 ఐపీఎల్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. ప్రస్తుతం అతడు ముంబయిలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ క్యాంప్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఈ క్యాంప్‌ను గైడ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం క్యాంప్‌లో రింకూ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా స్టేడియంలోకి స్థానికంగా ఉండే చిన్నారులు వచ్చారు. 'రింకూ','రింకూ' అంటూ చీర్ చేస్తూ అతడిని ఎంకరేజ్ చేశారు.
రింకూ ప్రాక్టీస్ సెషన్ ముగిసేవరకు అక్కడే ఉన్న వాళ్లతో రింకూ సరదాగా గడిపాడు. రింకూ ఆటోగ్రాఫ్ తీసుకున్న చిన్నారులు అతడితో సెల్ఫీలు తీసుకున్నారు. ఈ వీడియోను కేకేఆర్ అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 'సబ్ కా ఫేవరెట్,రింకూ సింగ్' (రింకూ అందరికి ఇష్టమైన ఆటగాడు) అని క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ పట్ల రింకూ రెస్పాన్స్‌కు ప్రశంసలు కురిపిస్తున్నారు.
2023 ఐపీఎల్లో కేకేఆర్ తరఫున అత్యధిక పరుగులు నమోదు చేసిన బ్యాటర్ రింకూనే. గత సీజన్లో 14 మ్యాచ్‌ల్లో 149.53 స్టైక్ రేట్‌తో 474 పరుగులు బాదాడు. అందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో వరుసగా 5 సిక్స్‌లు బాది వెలుగులోకి వచ్చిన రింకూ తర్వాత మ్యాచ్‌ల్లోనూ అదరగొట్టాడు. దీంతో జూలైలో జరిగిన వెస్టిండీస్, ఐర్లాండ్ పర్యటలకు ఎంపికయ్యాడు. ఇక అంతర్జాతీయ టీ20ల్లోనూ రింకూ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు రింకూ 11 ఇన్నింగ్స్‌ల్లో 176.24 స్టైక్ రేట్‌తో 356 పరుగులు చేశాడు.