తెలంగాణ

telangana

ETV Bharat / sports

రిటైర్‌మెంట్‌పై ప్లాన్స్​లో రోహిత్​! ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత వన్డే, టెస్టులకు బైబై! - ROHIT SHARMA RETIREMENT

ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత రోహిత్​ రిటైర్మెంట్​ - బీసీసీతో చర్చలు

Rohit Sharma
Rohit Sharma Retirement (Associated Press)

By ETV Bharat Sports Team

Published : Feb 5, 2025, 2:22 PM IST

Rohit Sharma Retirement : మరికొద్ది రోజుల్లో పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమ్‌ఇండియా బరిలోకి దిగనుంది. అయితే గతేడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ సమయంలోనూ సంచలన నిర్ణయం తీసుకుంటాడని వార్తలు వినిపించాయి. అయినా టెస్టులకు వీడ్కోలు పలకలేదు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ రిటైర్మెంట్​పై నిర్ణయం తీసుకుంటాడని తెలుస్తోంది. మరోవైపు, బీసీసీఐ కూడా భవిష్యత్తు సారథ్యంపై ఆలోచన చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కొత్త సారథుల కోసం వేట షురూ!
కాగా, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2025-27 సీజన్‌తో పాటు వన్డే ప్రపంచ కప్‌ 2027 కోసం టీమ్ ఇండియాను సిద్ధం చేసే పనిలో బీసీసీఐ ఉంది. ఈ క్రమంలో సీనియర్ల భవితవ్యంపై ఓ స్పష్టత కోరే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. రోహిత్‌తో పోలిస్తే విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌ బాగుందని క్రిటిక్స్ అభిప్రాయం. మరికొన్నేళ్లు జాతీయ జట్టుకు విరాట్ ఆడే అవకాశాలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు రోహిత్ శర్మ వీడ్కోలు పలికితే అతడి స్థానంలో వన్డే, టెస్టు ఫార్మాట్లకు కెప్టెన్లను నియమించాల్సి ఉంటుంది. టెస్టులకు కెప్టెన్సీ రేసులో జస్‌ప్రీత్ బుమ్రా, రిషభ్‌ పంత్ ఉన్నారు. వన్డేలకు గిల్, పంత్‌ ఉన్నట్లు తెలుస్తోంది. యశస్వి జైస్వాల్‌కు సుదీర్ఘ ఫార్మాట్‌ బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్లు ఉన్నాయి.

రోహిత్​తో బీసీసీఐ డిస్కషన్​!
రిటైర్మెంట్​పై పై గత సెలక్షన్ కమిటీ సమావేశంలోనే రోహిత్‌తో సెలక్టర్లు, బీసీసీఐ బోర్డు సభ్యులు చర్చలు జరిపారని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అప్పుడు రోహిత్ కాస్త సమయం కావాలని అడిగాడని తెలిపాయి. ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత రోహిత్ తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవచ్చని వెల్లడించాయి. డబ్ల్యూటీసీ కొత్త సీజన్‌తోపాటు వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని మేనేజ్‌మెంట్ ప్రణాళికలను సిద్ధం చేయనుందని చెబుతున్నాయి.

"ప్రతిఒక్కరితో చర్చలు జరిపి భారత జట్టులో మార్పులు తీసుకురావాలనేది బీసీసీఐ అభిమతం. కెప్టెన్లుగా ఎవరిని నియమిస్తారనేది తెలియాల్సి ఉంది. బుమ్రా సారథ్యంపై ఎలాంటి ఇబ్బంది లేవు. అయితే గాయాల బెడద అతడికి అతడికి మైనస్ గా మారింది. అందుకే, నిలకడగా ఉండే ప్లేయర్‌ వైపు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. రిషభ్‌ పంత్‌ బలమైన అభ్యర్థి. అతడితో పాటు యశస్వి కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. " అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

పాక్​లో ఛాంపియన్స్ ట్రోఫీ ఓపెనింగ్ సెర్మనీ- BCCI ఆలోచనేంటి? రోహిత్ వెళ్తాడా?

'నా వైఫ్​ చూస్తుంది, నేను అస్సలు చెప్పను'- మంధానకు రోహిత్ షాకింగ్ ఆన్సర్​

ABOUT THE AUTHOR

...view details