RCB vs UP WPL 2024 :2024 డబ్ల్యూపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా యూపీ వారియర్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 పరుగుల తేడాతో నెగ్గింది. 158 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన యాపీ 155-7 పరుగులకే పరిమితమైంది. యూపీలో శ్వేత సెహ్రావత్ (31 పరుగులు), గ్రేస్ హరిస్ (38) రాణించారు. బెంగళూరు బౌలర్లలో శోభన ఆశా 5 వికెట్ల ప్రదర్శనతో మెరిసింది. సోఫీ 1 వికెట్ దక్కించుకుంది.
బెంగళూరు బోణీ- 5 వికెట్లతో మెరిసిన శోభన - WPL 2024 Points Table
RCB vs UP WPL 2024: 2024 డబ్ల్యూపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. యూపీ వారియర్స్‌పై బెంగళూరు 2 పరుగుల తేడాతో గెలిచింది.
Published : Feb 24, 2024, 10:59 PM IST
|Updated : Feb 25, 2024, 7:06 AM IST
WPL 2024 Sobha Five Wickets(శోభ అద్భుతం) : - 16 ఓవర్లలో యూపీ వారియర్స్ మూడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. క్రీజులో గ్రేస్ హారిస్ (38; 22 బంతుల్లో 4×4, 2×6), శ్వేత సెహ్రావత్ (31) కుదురుకొని ఆడుతున్నారు. చివరి 4 ఓవర్లలో మరో 32 పరుగులు చేస్తే విజయం ఆ జట్టుదే. కానీ అప్పుడే శోభన ఆశ వచ్చి అద్భుతం చేసింది. ఒకే ఓవర్లో శ్వేత, గ్రేస్, కిరణ్ నవ్‌గిరె (1)ల వికెట్లను తీసింది యూపీ ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో ఒక్కసారిగా యూపీ ఓటమి బాటలోకి వెళ్లిపోయింది. తర్వాత మిగతా బ్యాటర్లు అందరూ పోరాడినా ఫలితం లేకపోయింది. కాగా, డబ్ల్యూపీఎల్‌లో 5 వికెట్ల ప్రదర్శన చేసిన తొలి భారత బౌలర్‌గా శోభన రికార్డు సృష్టించింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్ డెవిని (1), కెప్టెన్ స్మృతి మంధాన (13) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అయితే వన్ డౌన్లో వచ్చిన తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (53 పరుగులు), రిచా ఘోష్ (62 పరుగులు) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. యూపీ బౌలర్లలో గైక్వాడ్ 2, దీప్తి శర్మ, ఎక్సెల్‌స్టోన్, తహిళ మెక్‌గ్రాత్, గ్రేస్ హరిస్ తలో వికెట్ పడగొట్టారు.