తెలంగాణ

telangana

ETV Bharat / sports

అక్షర్ పోరాటం వృథా - ఆర్సీబీ ఖాతాలో మరో సూపర్ విక్టరీ - IPL 2024 - IPL 2024

RCB VS DC IPL 2024 : ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన పోరులో ఆర్సీబీ విజయం సాధించింది. 47 పరుగుల తేడాతో దిల్లీని ఓడించింది.

RCB VS DC IPL 2024
RCB VS DC IPL 2024 (Source : Associated Press)

By ETV Bharat Telugu Team

Published : May 12, 2024, 11:06 PM IST

RCB VS DC IPL 2024 :బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన పోరులో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 47 పరుగుల తేడాతో దిల్లీని ఓడించింది.

తొలుత బ్యాటింగ్​కు దిగిన ఆర్సీబీ జట్టు దూకుడుగా ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 187 పరుగులు స్కోర్ చేసింది. రజత్ పటీదార్ 52 పరుగులతో అదరగొట్టగా, తనతో పాటు విల్ జాక్స్(41) కూడా జట్టుకు మంచి స్కోర్ అందించాడు. కామెరూన్‌ గ్రీన్‌ (32), విరాట్ కోహ్లీ (27), మహిపాల్ లోమ్రోర్ (13) ఫర్వాలేదనిపించారు. కెప్టెన్ ఫాఫ్​ డుప్లెసిస్ ​(6), కర్ణ్ శర్మ(6) అయితే దినేశ్​ కార్తిక్ (0), స్వప్నీల్ సింగ్(0), మహ్మద్ సిరాజ్(0) నిరాశపరిచారు.

ఆర్సీబీ నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన దిల్లీ జట్టునున ఆర్సీబీ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో వరుస వికెట్లు కోల్పోయి డీలా పడింది. ఇంపాక్ట్​గా బరిలోకి దిగిన డేవిడ్ వార్నర్ ఒక్క పరుగు తీసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మెక్​గ్రూక్​ (21), అభిషేక్ పోరల్ (2), కుమార్ కుశాగ్రా (2) ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు. దీంతో 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందించిన షాయ్ హోప్ కూడా 29 పరుగులకు ఔటయ్యాడు. త్రిష్టాన్ స్టబ్స్ (3)​ కూడా పేలవంగా ఆడాడు.

అయితే దిల్లీ జట్టును ఆదుకునేందుకు బరిలోకి దిగిన అక్సర్ పటేల్ దూకుడుగా ఆడాడు. అయితే అనూహ్యంగా అతడు డుప్లెసిస్​ చేతికి చిక్కి 57 పరుగలకు ఔటయ్యాడు. దీంతో ఆ జట్టు కష్టాల్లో పడిపోయింది. ఆ తర్వాత వచ్చిన ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ కూడా ఔటయ్యారు. దీంతో ఆ జట్టు ఓటమిని చవి చూసింది.

దిల్లీ తుది జట్టు :అక్షర్‌ పటేల్‌ (కెప్టెన్‌), జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌, ఇషాంత్‌ శర్మ, అభిషేక్‌ పొరెల్‌, షై హోప్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, కుమార్‌ కుశాగ్ర, కుల్‌దీప్‌ యాదవ్‌, రసిక్‌ సలామ్‌, ఖలీల్‌ అహ్మద్‌, ముకేశ్‌ కుమార్‌.
ఇంపాక్ట్ ప్లేయర్స్ :డేవిడ్‌ వార్నర్‌, సుమిత్‌ కుమార్‌, ప్రవిన్‌ దూబె రికీ భుయ్‌, విక్కీ ఓత్స్వాల్‌.

బెంగళూరు తుది జట్టు : ఫాఫ్‌ డు ప్లెసిస్‌ (కెప్టెన్‌), విల్‌ జాక్స్‌, రజత్‌ పాటిదార్‌, మహిపాల్‌ లామ్రోర్‌, కామెరూన్‌ గ్రీన్‌, దినేశ్‌ కార్తిక్‌, కర్ణ్‌ శర్మ, మహ్మద్‌ సిరాజ్‌,విరాట్‌ కోహ్లీ, లాకీ ఫెర్గూసన్‌, యశ్‌ దయాళ్‌.

ఇంపాక్ట్ ప్లేయర్స్ :స్వప్నిల్‌ సింగ్‌, అనూజ్‌ రావత్‌, సుయాశ్‌ ప్రభుదేశాయ్‌, వైశాక్‌ విజయ్‌ కుమార్‌, హిమన్షు శర్మ

పంజాబ్​ కోచ్​పై ప్రీతి జింటా ఫైర్- అందరిముందే బెదిరింపు- ఏం జరిగిందంటే? - Preity Zinta Sanjay Bangar

నరైన్ అరుదైన ఫీట్- మూడో ప్లేయర్​గా ఘనత- మ్యాచ్​లో నమోదైన రికార్డులు - IPL 2024

ABOUT THE AUTHOR

...view details