RCB Playoff Chances IPL 2024:2024 ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం సన్‌రైజర్స్ మ్యాచ్‌తో వరుసగా ఐదు పరాజయాలు మూటగట్టుకుంది. ఇప్పటివరకూ ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఒకదాంట్లోనే నెగ్గి, ఆరు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ ఓడింది. కేవలం 2 పాయింట్లతో పట్టికలో ఆర్సీబీ అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాల సంక్లిష్టం అయ్యాయి. అప్పుడే ఆర్సీబీ ప్లే ఆఫ్ ఛాన్స్‌ల గురించి అభిమానులు లెక్కలు వేస్తున్నారు. మరి ఆర్సీబీకి ఫ్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా? ఇంతకీ బెంగళూరు ఎలా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది? ఇప్పుడు చూద్దాం.
ఈ టోర్నీలో ప్రతి జట్టు లీగ్ దశలో 14మ్యాచ్‌ల చొప్పున ఆడతాయి. అందులో టాప్- 4 జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. అంటే ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే ప్రతి జట్టు కనీసం 8 మ్యాచ్‌లైనా నెగ్గాల్సి ఉంటుంది. ఇక ఈ టోర్నీలో ఆర్సీబీకి ఇంకా 7 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ లెక్కన బెంగళూరు నెక్ట్స్ ఆడే అన్ని మ్యాచ్‌ల్లో నెగ్గాలి. అది ఎంత వరకు సాధ్యం అనేది అందరి మదిలే మెదిలే ప్రశ్న.
ఆర్సీబీ తదుపరి కోల్‌కతా, సన్‌రైజర్స్, గుజరాత్, గుజరాత్, పంజాబ్, దిల్లీ, చెన్నై జట్లతో తలపడాల్సి ఉంది. అయితే టోర్నీలో 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించినా 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరవచ్చు. కానీ, అప్పుడు రన్‌రేట్, ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. అది ఆర్సీబీ చేతుల్లో లేని విషయం. అందుకే అద్భుతం జరిగితే తప్పా ఆర్సీబీ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరే ఛాన్స్‌లు చాలా తక్కువ!