Ravi Shastri On Yashasvi Jaiswal: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్‌పై మాజీలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్‌తో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో శతకం బాది పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 104 పరుగులు బాదిన యశస్వి, రిటైర్డ్ హర్ట్‌గా క్రీజును వదిలాడు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ ప్లేయర్ రవిశాస్త్రి అతడిని యంగ్ ఏజ్ నాటి సచిన్ తెందూల్కర్‌తో పోల్చాడు.
'జైశ్వాల్‌ను చూస్తుంటే యంగ్ ఏజ్ నాటి సచిన్ గుర్తొస్తున్నాడు. అతడు బ్యాటింగ్ మాత్రమే కాకుండా ఫీల్డింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. సచిన్ తన కెరీర్ ప్రారంభంలో ఎంత చురుగ్గా ఉండేవాడో ఇప్పుడు జైశ్వాల్ కూడా అలాగే ఆడుతున్నాడు. అతడు రోహిత్ శర్మకు పార్ట్‌టైమ్ బౌలర్‌గా కూడా ఉపయోగపడతాడు. జట్టుకు అవసరమైనప్పుడు జైశ్వాల్‌కు రోహిత్ బౌలింగ్ ఇవ్వాలి' అని రవిశాస్త్రి అన్నాడు.
నెక్ట్స్ సూపర్ స్టార్:జైశ్వాల్ మూడు ఫార్మాట్ల ఫ్యూచర్ సూపర్ స్టార్ అని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాగన్ అన్నాడు. 'మరో రోజు కూడా అద్భుతమైన గేమ్ చూశాం. మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కొన్ని తప్పిదాలు చేసింది. అవి భారత్‌కు కలిసొచ్చాయి. ఇక రానున్న రోజుల్లో జైశ్వాల్ అన్ని ఫార్మాట్లలో సూపర్‌స్టార్‌గా ఎదుగుతాడు' అని ట్వీట్ చేశాడు.