Rahmanullah Gurbaz ODI Rank :ఆఫ్గానిస్థాన్ యంగ్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 10లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి అఫ్గాన్ బ్యాటర్‌గా రికార్డు కొట్టాడు. ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో గుర్బాజ్ (692 రేటింగ్స్) ఏకంగా 10 స్థానాలు మెరుగుపర్చుకొని 8వ ప్లేస్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. కాగా, ఇటీవల సౌతాఫ్రికాపై అఫ్గాన్ 2- 1 తేడాతో వన్డే సిరీస్ దక్కించుకుంది. క్రికెట్ చరిత్రలో సౌతాఫ్రికాపై వన్డే సిరీస్ దక్కించుకోవడం అఫ్గాన్‌కు ఇదే తొలిసారి. ఈ సిరీస్ విజయంలో గుర్బాజ్ కీలక పాత్ర పోషించాడు.
గుర్భాజ్ ప్రదర్శన
సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో గుర్బాజ్ డకౌట్ అయ్యాడు. రెండో మ్యాచ్‌లో సూపర్ సెంచరీ (105 పరుగులు) బాదాడు. బలమైన సౌతాఫ్రికా బౌలింగ్ ఎటాక్‌ని సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఇక చివరి మూడో వన్డేలో ఆఫ్గాన్ ఓడినప్పటికీ గుర్బాజ్ 94 బంతుల్లో 89 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
క్రికెట్‌లో ఆఫ్గాన్ మార్క్
ఆఫ్గానిస్థాన్ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో బలపడుతోంది. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌లో చిన్న టీమ్, అండర్‌డాగ్‌లుగా ఆఫ్గానిస్థాన్‌ని పరిగణించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2024 టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్ స్టేజ్‌లో న్యూజిలాండ్, సూపర్ 8లో ఆస్ట్రేలియాకి షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్‌పై అద్భుత విజయంతో తొలి సారి టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇక తాజాగా సౌతాఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది.