తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెన్నిస్‌ దిగ్గజం రఫెల్ నాదల్ మొత్తం ఆస్తులు ఎంతో తెలుసా? - RAFAEL NADAL NETWORTH

రఫెల్ నాదల్ నెట్​ వర్త్, అతడు కెరీర్​లో అందుకున్న మొత్తం ప్రైజ్ మనీ వివరాలు ఇవే

source Getty Images
Rafael Nadal NetWorth (source Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2024, 7:45 PM IST

Rafael Nadal NetWorth : స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ (38) రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఓ ఎమోషనల్‌ వీడియోలో నాదల్‌ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అందులో నాదల్‌, "గత రెండు సంవత్సరాలు చాలా కష్టంగా గడిచాయి. అయితే నా ఆఖరి టోర్నమెంట్ డేవిస్ కప్ కావడం, స్పెయిన్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండటం సంతోషంగా ఉంది. 2004 సెవిల్లాలో మొదటి విజయంతో మొదలైన నా కెరీర్‌ను డేవిస్‌ కప్‌ పరిపూర్ణం చేస్తుంది." అని పేర్కొన్నాడు. అయితే నాదల్‌ రిటైర్మెంట్ నేపథ్యంలో అతడి నెట్‌ వర్త్‌, ఆదాయం సహా ఇతర విశేషాలు తెలుసుకుందాం.

రఫెల్ నాదల్ నెట్‌ వర్త్‌, సంపాదన - కొన్ని నివేదికల ప్రకారం, 2024 నాటికి నాదల్ నెట్‌ వర్త్‌ సుమారు $225 మిలియన్లు. అతడి ఆదాయంలో ఎక్కువ భాగం టెన్నిస్‌లో సాధించిన విజయాల నుంచే వచ్చింది. కెరీర్ మొత్తంలో $135 మిలియన్ల కన్నా ఎక్కువ ప్రైజ్ మనీ అందుకొన్నాడు. 2024లోనే $23.3 మిలియన్లు సంపాదించాడు. ఫోర్బ్స్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పారితోషికం పొందే క్రీడాకారుల్లో నాదల్‌ ఒకడు.

కెరీర్ మొత్తంలో, నాదల్ 36 మాస్టర్స్ టైటిల్స్, రెండు ఒలింపిక్ బంగారు పతకాలు సహా 92 ATP సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నాడు. అతడి ఖాతాలో 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ కూడా ఉన్నాయి.

బిజినెస్‌ వెంచర్లు, ఎండార్స్‌మెంట్‌లు - టెన్నిస్​లో కాకుండా నాదల్ పలు బిజినెస్​లోనూ సంపాదనను ఇన్​వెస్ట్​మెంట్ చేశాడు. నైక్‌ (Nike), బాబోలాట్ (Babolat), కియా (Kia), టామీ హిల్‌ఫిగర్ (Tommy Hilfiger), ఆమ్స్టెల్ (Amstel) వంటి ప్రధాన బ్రాండ్‌లకు ఎండార్స్‌మెంట్ చేశాడు. నైక్‌ కంపెనీతో కలిసి చాలా కాలం పని చేశాడు. నైక్‌ నాదల్‌ పేరు మీద ప్రత్యేకమైన దుస్తులు, షూలను కూడా రిలీజ్‌ చేసింది.

నాదల్ ఇతర బిజినెస్‌లలోకి కూడా ప్రవేశించాడు. మల్లోర్కాలో రఫా నాదల్ అకాడమీని స్థాపించాడు. అక్కడ యంగ్‌ టెన్నిస్‌ ప్లేయర్లకు శిక్షణ ఇస్తారు. రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కూడా పెట్టుబడి పెట్టాడు. మెక్సికోలో కూడా టెన్నిస్ సెంటర్ ఏర్పాటు చేశాడు.

ఇకపోతే టెన్నిస్ అకాడమీతో పాటు నాదల్ అనేక వ్యాపార సంస్థల్లో పెట్టుబడి పెట్టాడు. వీటిలో ఒకటి మాడ్రిడ్‌లోని టోటో రెస్టారెంట్. క్లాసిక్ సినిమా ప్యారడిసో ప్రేరణతో ప్రారంభించిన ఈ రెస్టారెంట్, మెడిటరేనియన్, ఇటాలియన్ వంటకాలను అందిస్తుంది.

అవార్డులు, విజయాలు - నాదల్ కెరీర్‌లో ఐదు ATP ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు గెలిచాడు. అలానే ఐదు ITF వరల్డ్ ఛాంపియన్ టైటిళ్లను సాధించాడు. రెండుసార్లు ప్రతిష్టాత్మకమైన లారెస్ వరల్డ్ స్పోర్ట్స్‌మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు.

విలాసవంతమైన జీవనశైలి - నాదల్ విలాసవంతమైన జీవనశైలిని ఆస్వాదిస్తున్నాడు. అతడి నివాసం మల్లోర్కాలో ఉంది. ఈ అందమైన ఇల్లును 2003లో $4 మిలియన్లకు కొనుగోలు చేశాడు. నాదల్‌కు డొమినికన్ రిపబ్లిక్‌లోని ప్లేయా న్యూవా రొమానాలో ఒక విల్లా కూడా ఉంది. దీన్ని 2012లో $2 మిలియన్లకు కొనుగోలు చేశాడు.

నాదల్‌ వ్యక్తిగత జీవితం - రఫెల్ నాదల్ 1986 జూన్ 3న స్పెయిన్‌లోని మల్లోర్కాలో జన్మించాడు. తండ్రి వ్యాపారవేత్త. అతడి బాబాయి టోని నాదల్, రఫెల్‌ నాదల్‌కు చిన్నప్పటి నుంచి శిక్షణ ఇచ్చాడు. ఎనిమిది సంవత్సరాల వయస్సుకే నాదల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లు గెలవడం ప్రారంభించాడు. బార్సిలోనాలో శిక్షణ పొందేందుకు ఆఫర్లు వచ్చినా, నాదల్ కుటుంబం అతడిని మల్లోర్కాలో ఉంచాలని నిర్ణయించుకుంది. నాదల్ తన స్నేహితురాలను 2019లో వివాహం చేసుకున్నాడు. ఈ జంట 2022లో కుమారుడు రఫెల్‌కు జన్మనిచ్చింది.

నాదల్‌కు టెన్నిస్‌తో పాటు ఫుట్‌బాల్, గోల్ఫ్, పోకర్ ఆడడం చాలా ఇష్టం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నాదల్‌ ఎడమ చేత్తో టెన్నిస్‌ ఆడినప్పటికీ, రోజువారీ కార్యకలాపాలకు మాత్రం కుడి చేతినే ఉపయోగిస్తాడు.

రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ దిగ్గజం రఫెల్‌ నాదల్‌

కొత్త ఫార్మాట్‌లో జరగనున్న రంజీ ట్రోఫీ - బీసీసీఐ చేసిన కీలక మార్పులు ఇవే!

ABOUT THE AUTHOR

...view details