Radhika Merchant Birthday Celebrations Dhoni : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ పుట్టిన రోజు (అక్టోబర్ 16) వేడుకలు ఇటీవలే గ్రాండ్‌గా జరిగాయి. ముంబయిలో ఈ బర్త్ డే పార్టీ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అంబానీ కుటుంబ సభ్యులతో పాటు సినీ, క్రీడా రంగానికి చెందిన తారలు కూడా హాజరై సందడి చేశారు.
క్రికెటర్లలో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ స్టైలిష్‌గా హాజరై సందడి చేశాడు. వైట్, ఆరెంజ్ కలర్ బార్డర్స్ ఉన్న ఓంబ్రే గ్రీన్ కలర్ షర్ట్, క్రిస్ప్ వైట్ ట్రౌసర్ ధరించి ఫొటోలకు స్మైలింగ్ పోజులు ఇచ్చాడు. అలాగే హీరోల్లో రణ్‌వీర్ సింగ్, అర్జున్ కపూర్, హీరోయిన్ జాన్వీ కపూర్, ఖుషి కపూర్ సుహానా ఖాన్, అనన్య పాండే, ఆర్యన్ ఖాన్, శిఖర్ పహారియాతో పాటు దర్శకుడు అట్లీ కూడా ఈ వేడుకల్లో కనిపించారు. రాధికకు ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
హీరో రణ్‌వీర్ సింగ్ అయితే ఫుల్ బియర్డ్ డ్యాషింగ్ లుక్‌లో కనిపించాడు. అతడు బ్లాక్ ప్యాంట్, వైట్ కలర్ సిల్క్ షర్ట్, బ్రౌన్ సన్‌గ్లాసెస్ ధరించి ఊబర్ లుక్‌లో ఆకట్టుకున్నాడు.
సుహానా ఖాన్ బ్లాక్ అండ్ వైట్ పోల్కా డాట్ డ్రెస్ ధరించగా, హీరోయిన్ అనన్య పాండే స్టన్నింగ్ ఎంబెలిష్డ్ సూట్ ధరించి గార్జియస్‌గా కనిపించింది. జాన్వీ కపూర్, ఖుషి కపూర్ ఇద్దరూ రాక్డ్ స్టైలిష్ బాడీకాన్ డ్రెస్‌లు ధరించి ఆకట్టుకున్నారు.