Rachin Ravindra World Record :గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరమైన న్యూజిలాండ్ యంగ్ క్రికెట్ రచిన్ రవీంద్ర తాజాగా అదిరిపోయే ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిపోయాడు. అలా తన కమ్‌బ్యాక్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు.
237 పరుగుల లక్ష్యాన్నిఛేదించే క్రమంలో 15 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కుప్పకూలిన కివీస్‌ను రచిన్ తన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. టామ్ లాథమ్, డెవాన్ కాన్వేతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అలా 95 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే ఆ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 105 బంతులు ఎదుర్కొన్న రచిన్, 12 ఫోర్లు, అలాగే ఓ సిక్సర్‌తో 112 పరుగులను స్కోర్ చేసి పెవిలియన్ బాట పట్టాడు.
అయితే తన సూపర్ సెంచరీతో జట్టును గట్టెక్కించడం వల్ల కివీస్ తమ లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 46.1 ఓవర్లలోనే ఛేదించింది. అందుకుంది. దీంతో తమ సెమీస్ బెర్త్‌ను న్యూజిలాండ్ ఖారారు చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో శతకొట్టిన రవీంద్ర పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు.
రచిన్ ఖాతాలో పడ్డ రికార్డులు ఇవే!
వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా రెండింటిలోనూ అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన ఏకైక బ్యాటర్‌గా రచిన్ చరిత్రకెక్కాడు. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే అతడు సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత తాజాగా బంగ్లాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ తొలి మ్యాచ్‌లోనూ శతకంతో చెలరేగిపోయాడు.