Abhishek Sharma vs Hyderabad :సన్‌రైజర్స్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మ సూపర్ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్, హైదరాబాద్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రఫ్పాడించాడు. ఈ మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రన్ (137 పరుగులు; 105 బంతుల్లో 20x4, 3x6) శతకంతో చెలరేగగా, అభిషేక్ (93 పరుగులు; 72 బంతుల్లో 7x4, 6x6) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు . వీరి విధ్యంసంతో పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 426 పరుగులు చేసింది.
ఇక భారీ లక్ష్య ఛేదనలో దిగిన హైదరాబాద్ 47.5 ఓవర్లలో 346 పరుగులకు ఆలౌటైంది. కె నితీశ్ రెడ్డి (111 పరుగులు, 87 బంతుల్లో) సెంచరీ, తనయ్ త్యాగరాజన్ (74 పరుగులు, 42 బంతుల్లో) హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం దక్కలేదు. కెప్టెన్ తిలక్ వర్మ (28 పరుగులు) నిరాశపర్చాడు. దీంతో పంజాబ్ 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 4, రఘు శర్మ 3, సన్వీర్ సింగ్, అభిషేక్ శర్మ, నమన్ ధిర్ తలో వికెట్ పడగొట్టారు.