Pm Modi On Ravichandran Ashwin :ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రవిచంద్రన్ అశ్విన్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించిన అశ్విన్ ఖేల్ రత్న అవార్డును ఇవ్వాలని ఇప్పటికే పలువురు కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం అశ్విన్ రిటైర్మెంట్పై స్పందించారు.
'నీ నిర్ణయంతో యావత్ క్రికెట్ అభిమానుల్లో ఆశ్చర్యం'
అశ్విన్‌ను అభినందిస్తూ ప్రధాని మోదీ ప్రత్యేకంగా లేఖ రాశారు. అశ్విన్ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిందంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నో ఆఫ్ బ్రేక్స్, క్యారమ్ బంతులతో ప్రత్యర్థులను బేంబెలెత్తించారని అశ్విన్‌కు కొనియాడారు. ఇప్పుడు రిటైర్మెంట్ కూడా క్యారమ్ బాల్ మాదిరిగా ఉందని ప్రశంసించారు. అయితే, ఇలాంటి ప్రకటన చేయడం కూడా అత్యంత కఠినమని అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.
'జట్టు కోసం వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టావు'
"దేశం కోసం అద్భుతమైన ప్రదర్శన చేశావు. అందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నాను. జట్టు కోసం వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టావు. మీ అమ్మగారు ఆసుపత్రిలో ఉన్నప్పుడూ జట్టు కోసం ఆలోచించావు. చెన్నై వరదలు వచ్చినప్పుడు సాయం చేసేందుకు ముందుకొచ్చావు. ఇక నుంచి జెర్సీ నంబర్ 99ని మేం మిస్ కాబోతున్నాం" అని మోదీ లేఖలో అశ్విన్ గురించి రాసుకొచ్చారు.