తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు' అందుకున్న పిచ్ క్యూరేటర్‌ - ఎలాగంటే?

ప్లేయర్​ కాదు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు' అందుకున్న పిచ్ క్యూరేటర్‌ - ఎప్పుడో తెలుసా?

Pitch Curator Man Of  The Match Award
Pitch Curator Man Of The Match Award (Getty Images)

By ETV Bharat Sports Team

Published : 5 hours ago

Pitch Curator Man Of The Match Award : క్రికెట్‌ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన ఆటగాడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇస్తారు. సాధారణంగా బౌలర్‌, బ్యాటర్‌ లేదా ఆల్‌రౌండర్‌లు ఈ అవార్డు అందుకుంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో గ్రౌండ్స్‌మన్, ఫీల్డర్ లేదా పిచ్ క్యూరేటర్లను కూడా ఈ అవార్డు వరిస్తుంది. అదేంటి అని నమ్మలేకపోతున్నారా? అయితే ఆ ప్రత్యేక సందర్బాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

2000 డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన క్రిస్ స్కాట్ అంతర్జాతీయ క్రికెట్‌లో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్న మొదటి, ఏకైక పిచ్ క్యూరేటర్. జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికా- న్యూజిలాండ్ మధ్య జరిగిన చివరి, మూడో టెస్టులో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వర్షం కారణంగా మ్యాచ్‌కి అంతరాయం ఎదురైంది. మొదటి, నాలుగో రోజు ఆట పూర్తిగా జరగలేదు. అప్పటికే దక్షిణాఫ్రికా 2-0తో సిరీస్‌లో ఆధిక్యంలో ఉంది. మూడో టెస్టు నామమాత్రమే అయినా వాతావరణం అనుకూలించలేదు.

హెడ్ క్యూరేటర్ స్కాట్, అతడి గ్రౌండ్స్‌మెన్ టీమ్‌ మ్యాచ్‌ జరిగేందుకు అవిశ్రాంతంగా పని చేసింది. వారి పని అంత సులభం కాదు, అప్పటికి నేటిలా టెక్నాలజీ అభివృద్ధి చెందలేదు, అందుబాటులో లేదు. తడిసిన పిచ్‌ను ఆరబెట్టడానికి చాలా మాన్యువల్ వర్క్‌ అవసరం. గ్రౌండ్‌ని ఆరబెట్టడానికి ఎయిర్ బ్లోయర్స్, హెయిర్‌ డ్రైయర్‌, పెడెస్టల్‌ ఫ్యాన్‌లు వంటి బేసిన్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌పై ఆధారపడాల్సి వచ్చింది. ఈ రోజల్లో అయితే అరగంటలో పిచ్‌ను ఆరబెట్టగలరు. 2000ల సమయంలో పిచ్‌ని ఆరబెట్టడం చాలా కష్టం. కొన్ని కీలక మ్యాచ్‌లలో ఆరబెట్టడానికి హెలికాప్టర్లను కూడా వినియోగించారు.

అలాంటిది, స్కాట్, అతని టీమ్‌ అద్భుతం చేసింది. ఆఖరి రోజు మళ్లీ వర్షం కురిసినప్పుడు మూడు గంటల్లోపు పిచ్, అవుట్‌ఫీల్డ్‌ను ఆరబెట్టారు. వీరి కృషితో మ్యాచ్‌ సాధ్యమైంది. స్కాట్, అతని టీమ్‌ చేసిన కృషికి మ్యాచ్ అధికారులు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్’ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తొలిసారి ప్లేయర్‌కి కాకుండా సిబ్బందికి ఇచ్చారు.

అంతేకాదు, వన్డేల్లో అత్యధిక పరుగులను ఛేజింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాచ్‌కి స్కౌట్‌ పిచ్‌ సిద్ధం చేశాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 434 పరుగులు ఛేదించింది. పిచ్ క్యూరేటర్‌గా స్కౌట్‌ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

ఐపీఎల్​లో తొలి బంతి వేసిన బౌలర్ ఎవరో తెలుసా?

మాజీ మహిళా క్రికెటర్​కు అరుదైన గౌరవం- ICC హాల్ ఆఫ్ ఫేమ్​లో భారత ప్లేయర్​కు ప్లేస్

ABOUT THE AUTHOR

...view details