తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్ మెడలిస్ట్​ స్వప్నిల్​కు డబుల్ ప్రమోషన్​ - రైల్వే శాఖలో పదోన్నతి - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024

Paris Olympics 2024 Swapnil Kusale Double Promotion : పారిస్ ఒలింపిక్స్ కాంస్య విజేత స్వప్నిల్ కుసాలేకు మెడల్​తో పాటు ఉద్యోగంలోనూ ప్రమోషన్ లభించింది. టీటీఈగా ఉన్న స్వప్నిల్​కు ఓఎస్‌ డీగా పదోన్నతి ఇచ్చింది రైల్వే శాఖ. పూర్తి వివరాలు స్టోరీలో

source Associated Press
Paris Olympics 2024 Swapnil Kusale (source Associated Press)

By ETV Bharat Sports Team

Published : Aug 2, 2024, 4:26 PM IST

Paris Olympics 2024 Swapnil Kusale Double Promotion :పారిస్ ఒలింపిక్స్​లో పురుషుల 50మీటర్ల రైఫిల్ 3పొజిషన్స్ ఈవెంట్​ లో​ యంగ్ షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఒలింపిక్ పతక విజేతకు ప్రోత్సాహకంగా సెంట్రల్ రైల్వే పదోన్నతి కల్పించింది. స్వప్నిల్​ను టీటీఈ నుంచి ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్‌ డీ)గా నియమిస్తూ ప్రమోషన్‌ ఆర్డర్​ను జారీ చేసినట్లు సెంట్రల్‌ రైల్వే తెలిపింది. ఇకపై కుసాలే ముంబయిలోని స్పోర్ట్స్‌ సెల్​కు ఓఎస్‌డీగా వ్యవహించనున్నాడు.

9 ఏళ్ల తర్వాత ప్రమోషన్ -స్వప్నిల్ తొమ్మిదేళ్లుగా సెంట్రల్ రైల్వేలో టికెట్ కలెక్టర్​గా పనిచేస్తున్నాడు. అయితే ఎన్ని సార్లు ప్రమోషన్​కు అప్లై చేసుకున్నా ఫలితం లేకుండా పోయిందని అతడి కోచ్ దీపాలి దేశ్‌ పాండే ఓ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రైల్వే శాఖ నిర్ణయం పట్ల స్వప్నిల్​ నిరాశ చెందాడని ఆమె ఆరోపించారు. 'స్వప్నిల్ ప్రమోషన్ ఫైల్​ను ఉన్నతాధికారుల పరిశీలనకు పంపేందుకు అతడిని ఆఫీసులో రిపోర్టు చేయమని రైల్వే అధికారులు అడిగారు. అయితే పారిస్ ఒలింపిక్స్​కు వెళ్లేందుకు శిక్షణలో బిజీగా ఉండడం వల్ల స్వప్నిల్ రైల్వే కార్యాలయానికి వెళ్లలేకపోయాడు.' అని దీపాలి దేశ్‌ పాండే తెలిపారు.

రెండు రోజుల్లో డబుల్ ప్రమోషన్ - ఒలింపిక్ పతక విజేత స్వప్నిల్ కుసాలేకు రెండు రోజుల్లో డబుల్ ప్రమోషన్ కల్పిస్తామని సెంట్రల్ రైల్వే అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ రంజిత్ మహేశ్వరి పేర్కొన్నారు. ఆయన ప్రమోషన్​ను అడ్డుకున్నామన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

పారిస్ ఒలింపిక్స్​లో భాగంగా గురువారం(ఆగస్ట్ 1) జరిగిన పురుషుల 50మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్​లో​ యంగ్ షూటర్ స్వప్నిల్ కుసాలే 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని గెలిచాడు. ఆట ప్రారంభంలో స్వప్నిల్ కాస్త నెమ్మదించినప్పటికీ, తర్వాత పుంజుకున్నాడు. ఒక దశలో టాప్ -2లోకి దూసుకెళ్లాడు. ఇక చివర్లో ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురవడం వల్ల స్వప్నిల్ మూడో స్థానానికి పరిమితమయ్యాడు. స్వప్నిల్ కంటే ముందు 463.6 పాయింట్లతో లీ యుకున్ (చైనా) స్వర్ణ పతకం దక్కించుకోగా, 461.3 పాయింట్లతో కులిశ్ (ఉక్రెయిన్) రజతం గెలుచుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details