Paris Olympics 2024 Indian athletes wears traditional dresses : ప్రపంచమంతా అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న పారిస్ ఒలింపిక్స్ అంగరంగ వైభవంగా ప్రారంభమైపోయాయి. ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి ఫ్రాన్స్‌లోని నదిలో ఆరంభ వేడుకలు నిర్వహించారు. సెన్ నది వేదికగా 6 కి.మీ పొడవునా దాదాపు 100 పడవల్లో 205 దేశాల క్రీడాకారులు పరేడ్ నిర్వహించారు. ఆరంభ వేడుకల్లో మొత్తం 3 వేల మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.
Paris Olympics 2024 Opening Ceremony :అయితే ఈ విశ్వక్రీడల్లో 32 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. అలానే ఈ ఒలింపిక్స్ పోటీలను భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రెండంకెల పతకాలే లక్ష్యంగా భారత క్రీడాకారులు రంగంలోకి దిగి తమ సత్తా చాటాలని ఎదురుచూస్తున్నారు. మొత్తంగా భారత్ తరఫున 117 మంది అథ్లెట్లు ఈ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు.
అలానే ఈ వేడుకల్లో భారత అథ్లెట్లు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు. భారత పురుష అథ్లెట్లు కుర్తా బుండీ ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. మహిళా అథ్లెట్లు చీర ధరించారు. భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగమ్మాయి పీవీ సింధు చీర కట్టులో కనిపించి ఆకట్టుకుంది. ఈమె ఓపెనింగ్ సెర్మనీలో భారత బృందానికి ఫ్లాగ్ బేరర్‌గా ఉంది. మొత్తంగా ఈ సంప్రదాయ దుస్తుల్లోనే ఓపెనింగ్ సెర్మనీలో వీరంతా మార్చ్ చేశారు. భారతీయత ఉట్టిపడేలా త్రివర్ణ పతాకం రంగులు ఈ దుస్తులపై ఉండటం విశేషం. కాగా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఈ ఫొటోలోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మన అథ్లెట్లను ప్రోత్సహించండి అంటూ కోరింది.