తెలంగాణ

telangana

ETV Bharat / sports

పారిస్ ఒలింపిక్స్​ : చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్​ - పతకానికి ఇంకొక్క అడుగే - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024

Paris Olympics 2024 Live
Paris Olympics 2024 Live (Source: ETV Bharat)

By ETV Bharat Sports Team

Published : Aug 2, 2024, 12:39 PM IST

Updated : Aug 2, 2024, 10:44 PM IST

Paris Olympics 2024 Live:పారిస్ ఒలింపిక్స్​లో శుక్రవారం (ఆగస్టు 2) భారత అథ్లెట్లు పలు ఈవెంట్లలో పాల్గొననున్నారు. ఇప్పటికే రెండు పతకాలు సాధించిన షూటర్ మను బాకర్ మూడో ఈవెంట్​లో బరిలోకి దిగనుంది. ఈమె 25మీటర్లు రైఫిల్ మిక్స్​డ్ ఈవెంట్లో పాల్గొంటుంది. ఆమెతోపాటు మరిన్ని ఈవెంట్ల అప్డేట్స్ మీ కోసం.

LIVE FEED

10:28 PM, 2 Aug 2024 (IST)

సెమీస్​కు లక్ష్యసేన్​

PARIS OLYMPICS 2024 LAKSHYA SEN : భారత స్టార్ ప్లేయర్​ లక్ష్య సేన్​ పారిస్ ఒలింపిక్స్ 2024లో చరిత్ర సృష్టించాడు. తాజాగా బ్యాడ్మింటన్ మెన్స్​ సింగిల్స్​లో సెమీఫైనల్స్​కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్​లో తైవాన్‌కు చెందిన 12 సీడ్‌ ఆటగాడు చో చెన్‌పై 19-21, 21-15, 21-12 తేడాతో నెగ్గాడు. తద్వారా ఒలింపిక్స్​లో సెమీఫైనల్​కు చేరిన తొలి భారత మేల్ బ్యాడ్మింటన్​ ప్లేయర్​గా నిలిచాడు. దీంతో క్రీడాభిమానులు టేక్​ ఏ బౌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

7:48 PM, 2 Aug 2024 (IST)

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్లు సెమీస్‌లో నిరాశ పరిచారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీస్‌లో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్‌, అంకిత భకత్‌ ద్వయం పరాజయం పొందింది. సెమీ ఫైనల్‌లో ఈ జంట దక్షిణ కొరియాపై 2-6 తేడాతో ఓడింది. ఒకవేళ ఈ భారత జంట ఫైనల్‌కు చేరి ఉంటే పతకం ఖాయమయ్యేది. ఇక ఈ ఓటమితో ఈ ద్వయం ఇప్పుడు కాంస్య పతకం కోసం పోటీపడాల్సి ఉంటుంది.

6:53 PM, 2 Aug 2024 (IST)

పతకానికి అడుగు దూరంలో

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్లు అదరగొట్టారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్‌, అంకిత భకత్‌ ద్వయం సెమీ ఫైనల్‌కు చేరింది. దీంతో వీరు పతకానికి మరో అడుగు దూరంలో నిలిచారు. ఈ క్వార్టర్స్‌ ఫైనల్‌లో అంకిత, ధీరజ్‌ ధ్వయం 5-3 తేడాతో స్పెయిన్‌పై గెలుపొందింది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్‌ పోరులో అంకిత, ధీరజ్‌ ధ్వయం ఇండోనేషియా ద్వయం ఆరిఫ్‌-కోరునిసాపై 5-1తో విజయం సాధించింది.

ఆస్ట్రేలియాపై భారత హాకీ జట్టు విజయం - ఒలింపిక్స్‌ గ్రూప్‌ చివరి మ్యాచ్‌లో భారత హాకీ జట్టు గెలుపొందింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించింది. పూల్‌ బి నుంచి ఇప్పటికే భారత్‌, బెల్జియం, ఆసీస్‌ క్వార్డర్‌ ఫైనల్​కు అర్హత సాధించాయి. ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాను భారత్‌ ఓడించడం 1972 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.

5:28 PM, 2 Aug 2024 (IST)

Paris Olympics 2024 Indian Shooter Manu Bhaker : భారత యంగ్​ షూటర్‌ మను బాకర్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో దూకుడు చూపిస్తోంది. ఇప్పుడు ఆమె మరో పతకంపై గురి పెట్టింది. ఇప్పటికే ఈ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్​ను ఖాతాలో వేసుకున్న మను ఇప్పుడు మూడో విభాగంలోనూ ఫైనల్‌కు అర్హత సాధించింది. షూటింగ్‌ మహిళల 25మీ. పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్​లో టాప్‌ 2లో నిలిచింది. తద్వారా తుది పోరుకు దూసుకెళ్లింది.

3:37 PM, 2 Aug 2024 (IST)

  • పారిస్ ఒలింపిక్స్​లో భాగంగా జరిగిన క్వాలిఫికేషన్ ప్రిసిషన్ రౌండ్​లో భారత షూటర్ మను బాకర్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుని ముందుకెళ్లింది.

2:17 PM, 2 Aug 2024 (IST)

  • జూడో మహిళల (+78 కేజీలు) ఈవెంట్​లో భారత్​కు నిరాశ
  • ఇడలీస్ ఓర్టీజ్ (క్యూబా)​ చేతిలో ఓడిన తులికా మాన్ (భారత్)

2:12 PM, 2 Aug 2024 (IST)

  • ఆర్చరీ మిక్స్​డ్ టీమ్​ క్వార్టర్స్​లో స్పెయిన్​తో భారత్ ఢీ
  • మిక్స్​డ్ టీమ్ ఈవెంట్లో పాల్గొననున్న ధీరజ్​- అంకిత

1:34 PM, 2 Aug 2024 (IST)

  • ఆర్చరీ మిక్స్​డ్ టీమ్ క్వార్టర్స్​కు ధీరజ్- అంకితా భకత్
  • రౌండ్ 16లో ఇండోనేసియా ద్వయంపై 5-1 తేడాతో విక్టరీ
  • క్వార్టర్స్​లో స్పెయిన్ లేదా చైనాతో తలపడనున్న ధీరజ్- అంకితా

12:38 PM, 2 Aug 2024 (IST)

  • మూడో ఈవెంట్లో బరిలోకి దిగనున్న మను బాకర్
  • 25మీటర్ల రైఫిల్ మిక్స్​డ్​లో మను- ఈశా సింగ్ జోడీ

12:34 PM, 2 Aug 2024 (IST)

  • గోల్ఫ్ రౌండ్​ 2 సింగిల్స్ బరి​లో శుభాంకర్, గగన్​జీత్
Last Updated : Aug 2, 2024, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details