Paris Olympics 2024:పారిస్ ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో భారత క్రీడాకారిణి ఆకుల శ్రీజ బోణి కొట్టింది. ఆదివారం జరిగిన టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ 64వ రౌండ్‌లో ఆకుల శ్రీజ 11-4, 11-9, 11-7, 11-8 తేడాతో స్వీడెన్‌కు చెందిన క్రిస్టీనాను చిత్తు చేసింది. 30 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో శ్రీజ పూర్తి ఆధిపత్యం చలాయించింది. 4-0 తో క్రిస్టీనాను తెలుగు తేజం శ్రీజ చిత్తు చేసింది. 32వ రౌండ్‌లో అకుల శ్రీజ జియాన్ జెంగ్ లేదా ఇవానా మలోబాబిక్ తో తలపడనుంది. తొలిసారి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న ఆకుల శ్రీజ ఈ సారి దేశానికి ఎలాగైనా పతకాన్ని తీసుకురావాలని ఉవ్విళ్లూరుతోంది.
ఇక భారత షూటర్ రమితా జిందాల్ సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. 631.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరింది. మరోవైపు, 110 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ మరో భారత షూటర్ ఎలవెనిల్ మెడల్ రౌండ్‌కు అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫైయర్ రౌండ్ ఆసాంతం రమితా జిందాల్ కంటే ముందంజలో ఉన్న ఎలావెనిల్ ఆఖరి షాట్స్‌లో తడబడి ఫైనల్ అవకాశాలను చేజార్చుకుంది.