తెలంగాణ

telangana

ETV Bharat / sports

బంగ్లా చేతిలో ఘోర ఓటమి- పాకిస్థాన్​పై ఫుల్ ట్రోల్స్ - Pak vs Ban Test Series - PAK VS BAN TEST SERIES

Pak vs Ban Test Series: బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్​లో చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్​ను వారి సొంత గడ్డపై క్లీన్​స్వీప్ చేసింది. దీంతో పాక్​పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువయ్యాయి.

Pak vs Ban
Pak vs Ban (Source: Associated Press)

By ETV Bharat Sports Team

Published : Sep 3, 2024, 4:13 PM IST

Updated : Sep 3, 2024, 5:25 PM IST

Pak vs Ban Test Series:టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ సంచలనం సృష్టించింది. పాకిస్థాన్​ను వారి గడ్డపై తొలిసారి క్లీన్​స్వీప్​ చేసి చరిత్ర సృష్టించింది. పాక్​తో జరిగిన రెండు టెస్టుల సిరీస్​ను బంగ్లా 2- 0తేడాతో నెగ్గింది. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 185 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌ నైట్ స్కోరు 42/0తో (రెండో ఇన్నింగ్స్‌) మంగళవారం, ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఆ జట్టు 56 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ని అందుకుంది.

ఇక ఇటీవల ముగిసిన తొలి టెస్టులోనూ బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇప్పటికే వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న పాకిస్థాన్ తాజాగా పసికూన బంగ్లాతో టెస్టు సిరీస్ కోల్పోయింది. దీంతో పాకిస్థాన్​పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఈ మాత్రం దానికి 'ఆర్మీ ట్రైనింగ్ వృధా', 'ఆర్మీ ట్రైనింగ్ తర్వాత ఏకంగా బంగ్లా చేతిలో వైట్​వాష్ అయ్యింది' అంటూ మీమ్స్​ వస్తున్నాయి.

WTC పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి బంగ్లా
ఈ సిరీస్ విజయంతో బంగ్లా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకొచ్చింది. బంగ్లాదేశ్ 33పాయింట్లు, 45.83 పాయింట్ పర్సెంటేజీతో ఇంగ్లాండ్​ (45.00 పాయింట్ పర్సెంటేజీ)ను వెనక్కినెట్టి, నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్​లు ఆడిన బంగ్లా 3 విజయాలు నమోదు చేసింది. మరో మూడింట్లో ఓడింది. మరోవైపు పాకిస్థాన్ 7 మ్యాచ్​ల్లో 5 ఓటములతో ఎనిమిదో స్థానంలో ఉంది. 19.04 పాయింట్ పర్సెంటేజీతో పాకిస్థాన్ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

ఇకపై పాక్​ టియర్ 2 టీమ్!
స్వదేశంలో బంగ్లాదేశ్​తో సిరీస్ ఓటమితో పాకిస్థాన్ ఫ్యాన్స్ అసహనానికి గురవుతున్నారు. ఇప్పటినుంచి క్రికెట్​లో పాకిస్థాన్​ను టాప్ టీమ్​గా పరిగణించకూడదని ఓ నెటిజన్ అన్నాడు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి బడా టీమ్స్ ఉన్న టోర్నీల్లో పాక్ నెగ్గడం అసాధ్యం అని పేర్కొన్నాడు. ఇకపై పాక్​ను టియర్ (Tier 2) టీమ్​గా పరిగణంచడం బెటర్ అని తెలిపాడు.

బంగ్లాను ఆదుకున్న లిట్టన్ దాస్- పాక్​పై వీరోచిత శతకం - Litton Das vs Pakistan

'డిక్లేర్డ్‌' నిర్ణయంతో ఓటమి - పాక్ 4, భారత్ 1 - Losing Test Match After Declaring

Last Updated : Sep 3, 2024, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details