Ind vs Aus 1st Test 2024 :2024 బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో టీమ్‌ఇండియా విజృంభించింది. విదేశీ పిచ్‌లపై ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం కష్టమన్న అంచనాలను పటాపంచలు చేసింది. బ్యాటింగ్‌లో తడబడినా బౌలింగ్‌లో సంచలన ప్రదర్శన చేసింది. ఆస్ట్రేలియాకు సొంత గడ్డపై గత ఎనిమిదేళ్లలో ఎదురుకాని అత్యంత దారుణమైన పరిస్థితిని రుచి చూపించింది.
తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బౌలర్లు ఆసీస్ టాపార్డర్‌ను బెంబేలెత్తించారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా ఆసీస్ గడ్డపై నిప్పులు చెరిగారు. బుల్లెట్ లాంటి బంతులతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. దీంతో ఆసీస్ టాపార్డర్ కుప్పకూలింది. దెబ్బకు 38 పరుగులకే తొలి 5 వికెట్లు కోల్పోయింది. ఇందులో మూడు వికెట్లు బుమ్రానే పడగొట్టాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ ఓ చెత్త రికార్డు రిపీట్ చేసింది. 40ఏళ్లలో రెండోసారి 50 పరుగులలోపే సగం (5) వికెట్లు కోల్పోయింది.
2018లో హోబర్డ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో ఆసీస్ టాపార్డర్ తేలిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కేవలం 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోగా, తాజాగా భారత్‌తో మ్యాచ్‌లో 38 పరుగులకే సగం (5) కోల్పోయింది. దీంతో 1980 తర్వాత ఆసీస్ ఇలాంటి చెత్త రికార్డు నమోదు చెయ్యడం రెండోసారి కాగా, 2018 తర్వాత తొలిసారి.