Imane Khelif Controversy :ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్ లింగ వివాదం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆమెకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్‌ను ఫ్రెంచ్ మీడియా రీసెంట్గా లీక్ చేసింది. ఆమె కాదు, 'అతడు' అంటూ సోషల్ మీడియాలో విమర్శలు రేగాయి. దీంతో 'ఆమె'కు ఇచ్చిన గోల్డ్ మెడల్‌ను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లూ వినిపించాయి. ఈ క్రమంలో ఇమానె కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుసింగి. తన మెడికల్ రిపోర్ట్ లీక్ చేసిన మీడియాపై లీగల్ యాక్షన్‌కు సిద్ధమైనట్లు ఐవోసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
'ఇమానె ఖెలిఫ్ చట్టపరమైన చర్యలు తీసుకోవడాన్ని మేం అర్థం చేసుకుంటున్నాం. 2024 ఒలింపిక్స్ సమయంలో ఖెలిఫ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. తాజాగా వస్తున్న లీక్‌లపై పరువునష్టం దావా వేసేందుకు రెడీ అవుతోంది. లీగల్ యాక్షన్ విషయంలో ఐవోసీ ఎలాంటి కామెంట్ చేయదు. మెడికల్ రిపోర్ట్ వాస్తవమేనా? కాదా? అని తెలియకుండా బయట పెట్టిన మీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకుంది' అని ఐవోసీ తెలిపింది.
ఆమె కాదు అతడే!
అయితే ఇమానె లింగ గుర్తింపునకు సంబంధించిన వైద్య నివేధికను ఫ్రెంచ్ మీడియా ఇటీవల బయటపెట్టింది. ఇందులో కీలక విషయాలు బయటపడడం వల్ల క్రీడావర్గాలు షాక్‌కు గురయ్యాయి. ఖెలిఫ్ శరీరంలో అంతర్గంతగా వృషణాలు, XY క్రోమోజోములు ఉన్నట్లు మెడికల్ రిపోర్టులో తేలింది! దీంతో ఆమె లింగ వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. దీనిపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా రియాక్ట్ అయ్యాడు. ఆమె నుంచి స్వర్ణ పతకాన్ని వెనక్కి తీసుకోవాలని కోరాడు.