New Zealand VS Australia 10th Wicket Partnership Record In Test : వెల్లింగ్టన్ వేదికగా ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు అద్భుత విజయం సాధించింది. 172 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 369 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్, ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ దాటికి 196 పరుగులకే కుప్పకూలింది. లియోన్ 6 వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి జట్టును బంబేలెత్తించాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తమ రెండు ఇన్నింగ్స్‌లో - 383, 164 పరుగులు చేయగా న్యూజిలాండ్ 179, 196 రన్స్ సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ ప్లేయర్స్ కామెరూన్ గ్రీన్ - జోష్ హేజిల్‌వుడ్ పదో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. ఇది రికార్డ్ పరంగా 16వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో చివరి వికెట్‌కు అత్యధిక పరుగులు చేసిన టాప్ - 10 జోడీల గురించి ఈ స్టోరిలోకి వెళ్లి తెలుసుకుందాం.
- 2014లో ఇంగ్లాండ్ టీమ్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్‌లో జో రూట్ - అండర్సన్ పదో వికెట్‌కు 198 పరుగులు జోడించి ఆకట్టుకున్నారు.
- 2013లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ తలపడిన పోరులో పీజే హ్యూజ్ - అగర్ పదో వికెట్‌కు 163 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
- 1973లో న్యూజిలాండ్ పాకిస్థాన్ పోటీ పడిన మ్యాచ్‌లో హాస్టింగ్స్ - కొలింగె పదో వికెట్‌కు 151 పరుగులు జోడించారు.
- 1997లో పాకిస్థాన్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో అజ్హర్ మహమూద్ - ముస్తాఖ్ అహ్మద్ 151 పరుగుల పార్టర్న్‌షిప్ చేశారు.
- 2012లో వెస్టిండీస్ ఇంగ్లాండ్ తలపడిన సమయంలో రామ్‌దిన్ - బెస్ట్ 143 రన్స్ జోడించి అందరి దృష్టిని ఆకర్షించారు.
- 1977లో వసీమ్ రజా - వసీమ్ బరి పాకిస్థాన్ వెస్టిండీస్ మధ్య సాగిన పోరులో 133 రన్స్ నమోదు చేశారు.
- 2004లో టీమ్ ఇండియా బంగ్లాదేశ్ తలపడిన సమయంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ - జహీర్ ఖాన్ 133 రన్స్ జోడించారు.
- 1903లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా తలపడినప్పుడు ఫోస్టర్ - రోడ్స్ 130 పరుగులు నమోదు చేశారు.
- 1966లో ఇంగ్లాండ్ వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హిగ్స్ - జేఏ స్నో 128 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు.
- 20013లో న్యూజిలాండ్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వాట్లింగ్ - బౌల్ట్ జోడీ 127 పరుగులు జోడించారు.