Sandeep Lamichhane:అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచ్చెన్కు ఆ దేశ హైకోర్టులో ఊరట లభించింది. జిల్లా కోర్టు ఇచ్చిన ఎనిమిదేళ్ల జైలు శిక్ష తీర్పును తోసిపుచ్చింది. సందీప్‌ను నిర్దోషిగా ప్రకటించింది. బుధవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. 2022లో కాఠ్ మాండూలోని ఓ హోటల్లో సందీప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మైనర్ కోర్టును ఆశ్రయించింది.
దీనిపై విచారణ చేపట్టిన నేపాల్ జిల్లా కోర్టు 2024 జనవరిలో సందీప్‌కు ఎనిమిదేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సందీప్ హై కోర్టును ఆశ్రయించాడు. తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్ సూర్య దర్శన్, దేవ్ భట్టా డివిజన్ బెంచ్, గతంలో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఈ కేసులో సందీప్‌ను నిర్దోషిగా తేల్చింది.
ఇదీ కేసు: 2022 ఆగస్టు 21న కాఠ్ మాండూ, భక్తపూర్లో తనను పలు ప్రాంతాల్లో తిప్పి అదే రోజు రాత్రి కాఠ్ మాండు సినమంగల్‌లోని ఓ హోటల్‌కు తీసుకొచ్చి అక్కడే అత్యాచారం చేసినట్లు నేపాల్‌కు చెందిన ఓ 17 ఏళ్ల మైనర్ ఆరోపించింది. అతడిపై అక్కడి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. నేపాల్ కోర్టు కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో నేపాల్ క్రికెట్ బోర్డు సందీప్‌పై వేటు వేసింది. ఇక గతేడాది కరీబియన్ ప్రీమియర్ లీగ్ పూర్తి చేసుకొని నేపాల్‌కు తిరిగి వచ్చిన సందీప్‌ను పోలీసులు ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. 2022 నవంబర్‌లో అతడ్ని జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. అయితే హై కోర్టుకు వెళ్లి సందీప్ బెయిల్ తెచ్చుకున్నాడు.