తెలంగాణ

telangana

ETV Bharat / sports

కూతురితో ధోనీ ఫారిన్​ ట్రిప్- బీచ్​లో రిలాక్స్ అవుతున్న మహీ- ఫొటోలు వైరల్ - MS DHONI RELAX AT BEACH

ఫ్యామిలీ ట్రిప్​లో ఎంజాయ్ చేస్తున్న ధోనీ- ఫొటోలు షేర్ చేసిన జీవా

Dhoni at beach with ziva
Dhoni at beach with ziva (Source: AP (Left), Getty Images (Right))

By ETV Bharat Sports Team

Published : Nov 9, 2024, 12:54 PM IST

Updated : Nov 9, 2024, 1:51 PM IST

MS Dhoni Relax At Beach :టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ ప్రస్తుతం కుటుంబంతో సమయం గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే మిస్టర్ కూల్ ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్​కు వెళ్లాడు. థాయ్​లాండ్ బీచ్​లో కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నాడు. తన కూతురు జీవాసింగ్​తో ధోనీ సరదాగా ఆడుకుంటున్నాడు. ట్రిప్​నకు సంబంధించిన ఫొటోలను జీవా సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ధోనీ బీచ్​లో రిలాక్స్ అవుతూ కనిపించాడు. అలలకు ఎదురెళ్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. మహీ బీచ్​లో ఉండగా, జీవా ఒడ్డున నిలబడి తన తండ్రిని చూస్తూ అలలతో ఆడుకుంటుంది. కళ్లద్దాలు ధరించిన ధోనీ చాలా స్టైలిశ్​గా కనిపిస్తున్నాడు. ఫొటోల్లో జీవా కూడా క్యూట్​గా కనిపిస్తోంది. సన్​సెట్ ఫొటోలు సైతం జీవా ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసింది.

ఫాలోయింగ్ భారీగానే
మహీ గారాలపట్టి జీవా సింగ్​కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ భారీగానే ఉంది. ఈ చిన్నారి ఆకౌంట్​ను 28 లక్షల మందికిపైగా ఫాలో అవుతున్నారు. తన క్యూట్ ఫొటోలన్నీ ఇక్కడ షేర్ చేస్తుంటుంది. అంతేకాకుండా ఫ్యామిలీ ట్రిప్స్, అప్డేట్స్ కూడా ఇందులోనే షేర్ చేస్తుంటుంది. అయితే ఈ అకౌంట్​ తన తల్లి సాక్షి సింగ్ పర్యవేక్షిస్తుంటారట.

కాగా, 2025 ఐపీఎల్​లో ధోనీ బరిలో దిగనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ధోనీని ఇటీవల రిటెన్షన్స్​లో రూ.4 కోట్లకు అట్టిపెట్టుకుంది. దీంతో మళ్లీ మహీ మ్యాజికల్ బ్యాటింగ్ చూడవచ్చని ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు. గత కొన్ని సీజన్లుగా చెన్నై మ్యాచ్ ఉందంటే స్టేడియం ఏదైనా మైదానం అంతా పసుపు సముద్రంవలే మారిపోతోంది.

ధోనీ, ధోనీ నామంతో మైదానాలు మార్మోగిపోతున్నాయి. 2024 సీజన్​లో 14సార్లు బ్యాటింగ్​కు వచ్చిన మిస్టర్ కూల్ సిక్స్​లతో స్టేడియాలను మార్మోగించాడు. ఇక మరోసారి ధోనీని మైదానంలో చూసేందుకు ఫ్యాన్స్​ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్ బై చెప్పిన ధోనీ డొమెస్టిక్ (ఐపీఎల్ మాత్రమే) టోర్నీల్లో కొనసాగుతున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ రిటెన్షన్స్ 2025

  • రుతురాజ్ గైక్వాడ్ - రూ. 18 కోట్లు
  • రవీంద్ర జడేజా - రూ.18 కోట్లు
  • మతీష పతిరణ- రూ. 13 కోట్లు
  • శివమ్ దూబె - రూ. 12 కోట్లు
  • ధోనీ - రూ . 4కోట్లు

'లేట్​గా లేవడం, కుక్కలతో ఆడటం!' - ధోనీ డైలీ రొటీన్ ప్లాన్ ఏంటో తెలుసా?

'అది చాలా కష్టమైంది!' : IPL 2025 ఆడటంపై క్లారిటీ ఇచ్చిన ధోనీ!

Last Updated : Nov 9, 2024, 1:51 PM IST

ABOUT THE AUTHOR

...view details