తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ కొత్త రోల్​పై వీడిన సస్పెన్స్ - ఆ వీడియోతో క్లారిటీ!

Ms Dhoni IPL AD : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసి ఫ్యాన్స్​ను సస్పెన్స్​లో పడేశాడు. అయితే తాజాగా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చాడు ధోనీ.

Ms Dhoni IPL AD
Ms Dhoni IPL AD

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 6:50 PM IST

Ms Dhoni IPL AD :క్రికెట్ లవర్స్​కు పండుగ లాంటి ఐపీఎల్​ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. దీని కోసం ఇప్పటికే ఆయా ప్రాంచైజీలు సన్నాహాలు మొదలెట్టాయి. ఇక ప్లేయర్లు కూడా ప్రతి సారిలాగే ఈ సారి కూడా తమ బెస్ట్ పెర్ఫామెన్స్​ చూపించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సీజన్​కు సంబంధించిన ప్రోమో నెట్టింట ట్రెండ్ అయ్యింది. అందులో రిషబ్​ పంత్​, హార్దిక్ పాండ్య, కేఎల్​ రాహుల్, శ్రేయస్ అయ్యర్​ కనిపించి సందడి చేశారు.

అయితే తాజాగా ధోనీ కూడా ఫ్యాన్స్​కు ఓ స్పెషల్​ అప్​డేట్​ ఇస్తానంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. 'కొత్త సీజన్, కొత్త రోల్​ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను. త్వరలోనే అప్‌డేట్ ఇస్తాను'అంటూ ఓ పోస్ట్ షేర్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ పోస్ట్​ పై రకరకాలుగా కామెంట్​ చేయడం మొదలెట్టారు. 'ధోనీ ఈ సీజన్​ నుంచి తప్పుకున్నారేమో' అంటూ పలువురు సందేహం వ్యక్తం చేశారు. అయితే ధోనీ తన కొత్త రోల్​ ఏంటో తెలియజేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇది చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు.

ధోనీ ఓ యాడ్ కోసం ఈ పోస్ట్ పెట్టారని క్లారిటీ వచ్చింది. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియో సినిమాకు సంబంధించిన యాడ్​లో ఆయన రెండు రోల్స్​లో మెరిశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఓ వైపు ఊపిరి పీల్చుకున్నారు.

Dhoni IPL 2024 :మరోవైపు ధోనీ ఐపీఎల్​ సీజన్- 17 కోసం మంగళవారం చెన్నై నగరానికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని సీఎస్​కే తమ అఫీషియల్ ట్విట్టర్ పేజ్​లో షేర్ చేసింది. ఇక ధోనీ త్వరలోనే ఐపీఎల్​ ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. కాగా, వరుసగా 17వ సీజన్​లో కూడా సీఎస్​కే జట్టును నడిపించనున్నాడు.

అటు సీఎస్​కే ప్రాక్టీస్ సెషన్​ను కూడా మేనేజ్​మెంట్​ శనివారం ప్రారంభించింది. ఈ క్రమంలో జట్టు ప్లేయర్లు దీపక్ చాహర్, రుతురాజ్ గైక్వాడ్, సిమర్జీత్ సింగ్, రాజవర్ధన్ హంగర్గేకర్, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, అజయ్ మండల్, షేక్ రషీద్, నిశాంత్ సింధు ఇప్పటికే చెన్నై చేరుకున్నారు. కాగా, మార్చి 22న చెన్నై- బెంగళూరు మ్యాచ్​తో ఈ సీజన్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది.

ఓ వైపు ఆసక్తి - మరోవైపు టెన్షన్​ - సీఎస్కే కొత్త కెప్టెన్ అతడేనా?

వైరల్​గా ధోనీ టికెట్ కలెక్టర్ అపాయింట్‌మెంట్ లెటర్ - మీరు చూశారా?

ABOUT THE AUTHOR

...view details