తెలంగాణ

telangana

ETV Bharat / sports

2025 IPLలో ధోనీ- క్లారిటీ ఇచ్చేసిన చెన్నై ఓనర్! - MS DHONI IPL 2025

ధోనీ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్- వచ్చే సీజన్​ ఆడడంపై క్లారిటీ

MS Dhoni IPL 2025
MS Dhoni IPL 2025 (Source : IANS)

By ETV Bharat Sports Team

Published : Oct 26, 2024, 10:39 PM IST

MS Dhoni IPL 2025 :2025 ఐపీఎల్​లో ఎమ్​ఎస్ ధోనీ ఆడతాడా? లేదా అని కొన్ని రోజుల నుంచి ఫుల్ చర్చ నడుస్తోంది. దీనిపై పలుమార్లు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా మాట్లాడింది. తాము కూడా ధోనీ ఆడాలనే కోరుకుంటున్నామని చెప్పింది. ఈ విషయంపై అటు ధోనీ కూడా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. 'ఇకపై ఆడబోయే క్రికెట్‌ను మరింత ఎక్కువగా ఆస్వాదించాలనుకుంటున్నా' అని తన ఐపీఎల్​ కెరీర్​పై హింట్ ఇచ్చాడు. అయితే దీనిపై ఓ క్లారిటీ వచ్చేసింది.

2025 ఐపీఎల్​లో మిస్టర్ కూల్ బరిలో దిగనున్నాడు. దీన్ని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. వచ్చే సీజన్​లో చెన్నై తరఫున ఎంఎస్ ధోనీ ఆడతాడని ఆయన స్వయంగా స్పష్టం చేశారు. ఓ స్పోర్ట్స్​ ఛానెల్​తో మాట్లాడుతూ కాశీ విశ్వనాథన్ ఈ విషయాన్ని వెల్లడించారు. 'వచ్చే సీజన్​లో ధోనీ ఆడతాడు. దానికి మేం సంతోషంగా ఉన్నాము. అంతకన్నా ఇంకా ఏమి కావాలి?' అని అన్నారు. దీంతో తలా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. మళ్లీ ధోనీ బ్యాటింగ్ చూడవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ధోనీ పేరును ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు.

అన్​క్యాప్డ్​ ప్లేయర్​గా
చెన్నై సీఈవో తాజా వ్యాఖ్యల ప్రకారం ధోనీని సీఎస్కే అట్టిపెట్టుకోవడం ఖాయంగా చెప్పవచ్చు. రుతురాజ్ గైక్వాడ్​, రవీంద్ర జడేడా, డేవన్ కాన్వేతోపాటుగా అన్​క్యాప్డ్​ ప్లేయర్​గా ధోనీని అట్టిపెట్టుకోనున్నట్లు తెలుస్తోంది.

చెన్నై సూపర్ కింగ్స్​ రిటెన్షన్స్​ 2025 (అంచనా)

  • రవీంద్ర జడేజా
  • రుతురాజ్ గైక్వాడ్
  • శివం దూబే
  • ఎంఎస్ ధోని
  • డెవాన్ కాన్వే
  • మతీషా పతిరన

కాగా, ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి ప్లేయర్ల రిటైన్షన్ లిస్ట్ సమర్పించేందుకు గడువు దగ్గర పడుతోంది. అక్టోబర్ 31 సాయంత్రంలోపు అన్ని ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే ప్లేయర్ల లిస్ట్​ను ఐపీఎల్​ బోర్డు ముందు ఉంచాలి. ఇందులో గరిష్ఠంగా ఐదుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకోవచ్చు. ఒక రైట్​ టు మ్యాచ్ కార్డ్ కూడా ఉంటుంది. ఇక నవంబర్ చివరి లేదా డిసెంబర్ తొలి వారంలో మెగా వేలం జరగనుంది.

క్రికెట్ ఫ్యాన్స్​కు బిగ్ న్యూస్- IPL రిటెన్షన్స్​ లైవ్ స్ట్రీమింగ్​- డీటెయిల్స్ ఇవే!

'అది చాలా కష్టమైంది!' : IPL 2025 ఆడటంపై క్లారిటీ ఇచ్చిన ధోనీ!

ABOUT THE AUTHOR

...view details