తెలంగాణ

telangana

ETV Bharat / sports

'లేట్​గా లేవడం, కుక్కలతో ఆడటం!' - ధోనీ డైలీ రొటీన్ ప్లాన్ ఏంటో తెలుసా? - MS DHONI DAILY ROUTINE

క్రికెట్ ఆడకుంటే ధోనీ ఈ పనులు తప్పకుండా చేస్తాడట! - మిస్టర్ కూల్ డైలీ రొటీన్ ప్లాన్ ఏంటో తెలుసా?

MS Dhoni Daily Routine
MS Dhoni (Getty Images)

By ETV Bharat Sports Team

Published : Oct 30, 2024, 11:02 AM IST

Updated : Oct 30, 2024, 11:13 AM IST

MS Dhoni Daily Routine : అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ పలికిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుతం ఐపీఎల్​కు మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత సీజన్​లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ, ఓ ప్లేయర్​గా ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇక ఆ తర్వాత తన క్వాలిటీ టైమ్​ను ఫ్యామిలీకి అలాగే ఇతర బిజినెస్​లకు వినియోగిస్తున్నాడు.

మరోవైపు క్రికెట్​కు దూరంగా ఉన్నా కూడా ఫిట్​నెస్ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా న్యూ లుక్స్​తో దూసుకెళ్తున్నాడు. తాజాగా కూడా ఆయన ఫొటోలు కొన్ని నెట్టింట తెగ ట్రెండ్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఒక ప్రమోషనల్ ఈవెంట్​లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో ధోని తన డైలీ రొటీన్​ గురించి చెప్పుకొచ్చాడు.

"నా డైలీ షెడ్యూల్ కాస్త డిఫరెంట్​గా ఉంటుంది. అంతేకాకుండా అది నేను ఎక్కడ ఉన్నానన్న దానిపై ఆధారపడి ఉంటుంది. నేను ముంబయిలో ఎండార్స్‌మెంట్స్​ కోసం వస్తే, మేనేజ్​మెంట్​ నన్ను సెట్‌కి పిలిచే సమయం బట్టి ఉంటుంది. దాని ప్రకారం నేను నా షెడ్యూల్​ను ప్రిపేర్ చేసుకుంటాను. అయితే నేను రాంచీలో ఉన్నప్పుడు మాత్రం నా షెడ్యూల్ అక్కడి ప్రకారం ఫిక్స్ చేసుకుంటాను. కొంచెం లేట్​గా లేస్తాను. బ్రేక్​ఫాస్ట్ చేసి ఆ తర్వాత స్టేడియం లేదా జిమ్​కు వెళ్లి అక్కడ చేయాల్సింది చేస్తుంటాను. తిరిగి వచ్చి, నా ఫ్యామిలీతో అలాగే పెంపుడు జంతువులతో టైమ్ స్పెండ్ చేస్తుంటాను. ఇక సాయంత్రం, నాకు అనిపిస్తే, నేను మళ్లీ స్టేడియానికి వెళ్లి టెన్నిస్ లేదా బ్యాడ్మింటన్ ఆడతాను. అని ధోనీ తన డైలీ రొటీన్ గురించి చెప్పుకొచ్చారు.

అయితే రిటైర్మెంట్ తర్వాత ధోనీకి తన ఫ్యామిలీతో టైమ్​ స్పెండ్ చేయడమే కాకుండా అప్పుడప్పుడు వ్యవసాయం కూడా చేస్తూ కనిపించారు. దానికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఈ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని గురించి వివరించారు.

"నేను వ్యవసాయానికి వెళ్లినప్పుడల్లా ట్రాక్టర్‌ గురించి అలాగే అక్కడ ఉపయోగించే పరికరాల గురించి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఫీల్డ్​లో మీరు రెగ్యులర్‌గా లేకుంటే మీరు వాటిని మరచిపోతారు. అందుకే ఓ సారి ఈ ప్రాసెస్​ను తెలుసుకుంటే మీరు మళ్లీ వెళ్లినప్పుడల్లా ఆ పాఠాలు మీకు ఎంతో ఉపయోగపడుతాయి. ఇది చాలా కఠినమైన పనే అయినా చాలా సరదాగా ఉంటుంది" అని ధోనీ పేర్కొన్నారు.

ఝార్ఖండ్‌ ఎన్నికల బ్రాండ్‌ అంబాసిడర్‌గా ధోనీ

' మీకు అస్సలు ఏమీ తెలియదు'- ధోనీకి స్టంపింగ్​ రూల్స్‌ నేర్పించిన సాక్షి!

Last Updated : Oct 30, 2024, 11:13 AM IST

ABOUT THE AUTHOR

...view details