తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్టార్ సింగర్​తో పాట పాడిన సిరాజ్‌- వీడియో వైరల్ - SIRAJ ZANAI BHOSLE

సింగర్​గా మారిన సిరాజ్- ఆ ఆమ్మాయితో కలిసి పాట పాడిన క్రికెటర్​

Siraj Singing
Siraj Singing (Source : Associated Press)

By ETV Bharat Sports Team

Published : Feb 19, 2025, 9:17 AM IST

Siraj Zanai Bhosle : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్, హైదరాబాదీ ప్లేయర్ మహ్మద్ సిరాజ్‌ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అతడు ఓ ఆమ్మాయితో రిలేషన్​షిప్​లో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఇదిలా ఉండగా తాజాగా అతడు లెజెండరీ సింగర్ ఆశాభోస్లే మనవరాలు జనై భోస్లేతో కలిసి డ్యూయెట్‌ సాంగ్‌ పాడాడు.

జనై భోస్లేతో కలిసి సిరాజ్​ రాగం అందుకున్నాడు. జనై భోస్లే తాజా మ్యూజిక్‌ ఆల్బమ్‌లోని 'కెహందీ హై' పాటను వీరిద్దరూ కలిసి పాడారు. ఈ వీడియోను ఇటీవల సిరాజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్​లో వైరల్​గా మారింది. 'సిరాజ్ మల్టీ టాలెంటెడ్', 'డీఎస్పీ సిరాజ్ ఇకపై సింగర్ కూడా' అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

అయితే జనై భోస్లేతో క్రికెటర్ సిరాజ్‌ ప్రేమలో ఉన్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ముంబయి బాంద్రాలో జరిగిన ఆమె పుట్టిన రోజు వేడుకలకు సిరాజ్ హాజరయ్యాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ రిలేషన్​షిప్​లో ఉన్నట్లు తెగ రూమర్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే సిరాజ్‌ స్పందిస్తూ ఆమె తనకు చెల్లెలు లాంటిదని క్లారిటీ ఇచ్చాడు.

'ఆమె లాంటి సోదరి నాకెవరూ లేరు. ఆమె లేకుండా నేను ఎక్కడా ఉండాలనుకోను. నక్షత్రాలతో చంద్రుడు ఉన్నట్లే, ఆమె వెయ్యి మందిలో ఒకరు' అనే కవిత్వాన్ని ఇన్‌స్టా స్టోరీలో పోస్టు చేశాడు. మరోవైపు, జనై సైతం ఈ ఊహాగానాలపై స్పందించారు. సిరాజ్‌ తనకు ప్రియమైన సోదరుడని చెప్పడం వల్ల ఈ రూమర్స్​కు చెక్‌ పెట్టినట్లయ్యింది.

కాగా, బుధవారం ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభం కానుంది. గురువారం భారత్ తమ తొలి మ్యాచ్​ బంగ్లాదేశ్​తో ఆడనుంది. అయితే ఈ టోర్నీకి పేస్ బౌలర్​ సిరాజ్‌ను భారత జట్టులోకి తీసుకోలేదు. మహ్మద్ షమీ, హర్షిత్ రానా ఫుల్ టైమ్ పేసర్లుగా సెలక్ట్ అయ్యారు. సెలక్షన్ కమిటీ అతడిని కేవలం నాన్ ట్రావెల్ రిజర్వ్‌గానే ఎంపిక చేసింది.

'ట్రోఫీ విన్నర్​ను పక్కనపెట్టడం అన్యాయం' - నెట్టింట సిరాజ్​కు ఫ్యాన్స్ ఫుల్​ సపోర్ట్!

హెడ్​ Vs సిరాజ్ - ఐసీసీ ఫైన్ విషయంలో స్టార్​ పేసర్ కూల్ రిప్లై!

ABOUT THE AUTHOR

...view details