Mohammed Shami Ranji Trophy :టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ దాదాపు ఏడాది తర్వాత తాజాగా మైదానంలోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం జరగుతున్న రంజీ ట్రోఫీలో భాగంగా బెంగాల్ తరఫున బరిలోకి దిగిన షమీ, తాజాగా మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటాడు. సూపర్ బౌలింగ్ స్కిల్స్‌తో (4/54) తన జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తొలి రోజు (బుధవారం) 10 ఓవర్ల వేసిన షమీ ఆ మ్యాచ్‌లో 34 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీయలేదు. కానీ, రెండో రోజు (గురువారం) మాత్రం చెలరేగిపోయాడు. కేవలం 9 ఓవర్లు మాత్రమే వేసిన ఈ స్టార్ పేసర్ మరో 20 పరుగులు ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మంచి రనప్‌తో ఉత్సాహంగా ఆడూతూ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ పెర్ఫామెన్స్‌తో తనను టీమ్ఇండియాలోకి తిరిగి తీసుకోవాలని బీసీసీఐ సెలక్టర్లకు సందేశం ఇచ్చినట్లు తెలుస్తోందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
అటు ఐపీఎల్ ఇటు బీసీసీఐ - రెండిటికీ ఒకే ఆన్సర్
ఇక ఆస్ట్రేలియాలోని పేస్ పిచ్‌లపై షమీ మరింత విజృంభించగడని తెలుస్తోంది. ఈ క్రమంలో అతడ్ని బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ కోసం స్క్వాడ్‌లో చేరిస్తే భారత బౌలింగ్ విభాగం మరింత బలంగా మారనుంది. అయితే తొలి టెస్టు సమయానికి ఫిట్‌నెస్ నిరూపించుకొంటే మాత్రం షమీని ఆస్ట్రేలియా టూర్‌కు తీసుకొనే అవకాశాలు ఉన్నాయని గతంలోనే బీసీసీఐ హింట్స్ ఇచ్చింది. ఇప్పుడు రంజీలో కనబరిచిన అద్భుతమైన పెర్ఫామెన్స్ వల్ల కనీసం రెండో టెస్టు సమయానికైనా అతడ్ని జట్టుతోపాటు చేర్చే అవకాశం లేకపోలేదంటూ క్రికెట్ విశ్లేషకుల మాట . ఇక ఐపీఎల్‌లోనూ పక్కన పెట్టిన గుజరాత్ టైటాన్స్‌కు తాను సిద్ధమేనంటూ షమీ వారికి సిగ్నల్స్ ఇచ్చినట్లు అయ్యింది. గత ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ షమీ రికార్డుకెక్కిన నిలిచిన సంగతి తెలిసిందే.