Mitchell Starc On Jasprit Bumrah :టీమ్ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పెర్త్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న టెస్టులో రఫ్పాడిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తూ 4 వికెట్లు దక్కించుకున్నాడు. ఆ నేపథ్యంలో బుమ్రాపై ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ప్రశంసలు కురిపించాడు. బుమ్రా ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్‌ని ప్రశంసించాడు. మూడు ఫార్మాట్‌లలో స్థిరంగా రాణించడానికి తన బౌలింగ్ యాక్షనే ముఖ్య కారణమని తొలి రోజు ఆట ముగిసిన తర్వాత స్టార్క్ పేర్కొన్నాడు.
'బుమ్రా యూనిక్ యాక్షన్, ముఖ్యంగా మోచేయిలో ఉన్న హైపర్ ఎక్స్‌టెన్షన్ అతడి బౌలింగ్‌ని ప్రభావవంతంగా చేస్తుంది. బుమ్రా బంతిని రిలీజ్ చేసే పాయింట్‌ని ఇతర బౌలర్లు అనుకరించలేరు. అందుకే మూడు ఫార్మాట్లలోనూ సుదీర్ఘ కాలంపాటు బుమ్రానే అత్యుత్తమ బౌలర్‌గా కొనసాగుతాడని అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అతడి సత్తా ఏంటో ఇవాళ మరోసారి చూశాం. ఇతర బౌలర్లకు సాధ్యం కానిదేదో బుమ్రా వద్ద ఉంది. నేను కూడా అతడి స్టైల్‌ని ఎప్పుడూ ప్రయత్నించను. అలా చేస్తే గాయపడే ప్రమాదం ఉంది' అని చెప్పాడు.
భార్య పోస్ట్ వైరల్
కాగా, బుమ్రా సూపర్ సక్సెస్‌ను అతడి భార్య సంజనా గణేశన్ కూడా ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో భర్త ప్రదర్శనపై సోషల్ మీడియాలో సరదాగా స్పందించింది. బుమ్రా మ్యాచ్- టర్నింగ్ స్పెల్‌ను ప్రశంసిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో చీకీ పోస్ట్ షేర్ చేసింది. క్యాప్షన్‌లో 'గ్రేట్ బౌలర్, ఈవెన్ గ్రేటర్ బూటీ (Great bowler, even greater booty)' అని రాసింది. బుమ్రా పెర్ఫార్మెన్స్ ఇలా ప్రశంసించడం అభిమానులను ఆకర్షించింది.