SA T20 Final 2025 :2025 సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA T20) టైటిల్‌ను ముంబయి కేప్టౌన్స్ జట్టు దక్కించుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్స్తో శనివారం జరిగిన ఫైనల్లో ముంబయి 76 పరుగుల భారీ తేడాతో నెగ్గి ఛాంపియన్‌గా నిలిచింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. దీంతో ముంబయి తొలిసారి సౌతాఫ్రికా టీ20 లీగ్ టైటిల్‌ను ముద్దాడింది.
హ్యాట్రిక్ మిస్
కాగా, సన్‌రైజర్స్ జట్టు 2023, 2024 సీజన్లలో వరుసగా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి కూడా ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ మూడో టైటిల్ పట్టేయాలని పోరాడింది. కానీ, ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ముంబయి విజయం సాధించింది. దీంతో సన్‌రైజర్స్ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పటివరకు 3 సీజన్లు జరగ్గా, రెండుసార్లు సన్‌రైజర్స్, ఒకసారి ముంబయి ఛాంపియన్లుగా నిలిచాయి.
పాపం కావ్యా
ఈ సీజన్‌ను హ్యాట్రిక్ ఓటములతో ప్రారంభించిన సన్‌రైజర్స్, ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. కీలక మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. ఇక ఎలినినేటర్లోనూ నెగ్గి సన్‌రైజర్స్ ఫైనల్ చేరడంతో ఈసారి కప్పు గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
ఈ నేపథ్యంలోనే సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్ స్టేడియానికి వచ్చి లైవ్ మ్యాచ్ చూశారు. తమ జట్టు ఆటగాళ్లను ప్రోత్సహించారు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో ముంబయి ప్లేయర్లు బౌండరీల మీద బౌండరీలు బాదుతుంటే కావ్య మారన్ డల్‌గా అయిపోయారు. ఇక మ్యాచ్ ఓడిపోగానే ఆమె నిరాశకు గురయ్యారు. ఇక ఎడాది గ్యాప్‌లో సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ రెండుసార్లు (2024 ఐపీఎల్, 2025 సౌతాఫ్రికా లీగ్) టైటిల్ మిస్ అవ్వడం గమనార్హం.