Mayank Agarwal Hospitalized : టీమ్ ఇండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. రంజీ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు అగర్తల నుంచి దిల్లీకి వెళ్లే విమానంలో అనారోగ్యం బారిన పడినట్లు తెలిసింది. విపరీతమైన గొంతు నొప్పి, మంటతో అతడు బాధపడినట్లు తెలుస్తోంది. వాంతులు కూడా చేసుకున్నట్లు సమాచారం అందింది. దీంతే వెంటనే అతడిని అగర్తలాలోని ఐఎల్‍జే ఆస్పత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మయాంక్‌కు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స జరుగుతోందని సమాచారం. ఈ కారణంగా అతడు సౌరాష్ట్రతో జరగబోయే తర్వాత మ్యాచ్‌కు దూరం కానున్నాడు. అతడి స్థానంలో నిఖిన్ జోస్ కర్ణాటకకు సారథ్యం వహించనున్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్‍లో(Ranji Trophy 2024 Karnataka Team) కర్ణాటక జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు మయాంక్ అగర్వాల్. ఎలైట్ గ్రూప్-సీలో భాగంగా కర్ణాటక - త్రిపుర మధ్య జనవరి 29న మ్యాచ్ ముగిసింది. ఈ మ్యాచ్‍లో 29 పరుగుల తేడాతో కర్ణాటక విజయం సాధించింది. కర్ణాటక నెక్ట్స్ మ్యాచ్ ఫిబ్రవరి 2న ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం దిల్లీ మీదుగా రాజ్‍కోట్‍కు మయాంక్ చేరుకోవాల్సింది. ఇదే సమయంలో అతడు అనారోగ్యం బారిన పడ్డాడు.
Mayank Agarwal Health : "జట్టు మొత్తం విమానంలో ఉన్న సమయంలో మయాంక్ అగర్వాల్ అకస్మాతుగా అనారోగ్యానికి గురయ్యాడు. విమానంలో కూర్చున్న సమయంలోనే అతడు రెండుసార్లు వాంతులు కూడా చేసుకున్నాడు. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. వైద్య పరీక్షలు అవుతున్నాయి." అని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ వర్గాలు చెప్పినట్టు పీటీఐ వెల్లడించింది.