తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఛాంపియన్స్​ ట్రోఫీకి ముందు షాకింగ్ న్యూస్ - వన్డే క్రికెట్ గుడ్​బై చెప్పిన ఆసీస్​ ఆల్ ​రౌండర్! - MARCUS STOINIS RETIREMENT

ఛాంపియన్స్​ ట్రోఫీకి ముందు వన్డే క్రికెట్ గుడ్​బై చెప్పిన ఆసీస్​ ఆల్ ​రౌండర్ - షాక్​లో ఫ్యాన్స్!

Marcus Stoinis
Marcus Stoinis (Getty Images)

By ETV Bharat Sports Team

Published : Feb 6, 2025, 11:58 AM IST

Marcus Stoinis Retirement : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకాలు జరుగుతున్న తరుణంలో ఆస్ట్రేలియా టీమ్​కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ తాజాగా వన్డే క్రికెట్ వీడ్కోలు పలికాడు. అయితే టీ20 ఫార్మాట్‌కు అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు.

కన్​ఫ్యూజన్​లో ఫ్యాన్స్​
ఛాంపియన్స్ ట్రోఫీకి రెండు వారాల మాత్రమే ఉన్నందున ఇంకాస్త అందరిలోనూ టెన్షన్​ మొదలైంది. ఇప్పటికే గాయాల కారణంగా జోష్ హజల్‌వుడ్, మిచెల్ మార్ష్ లాంటి స్టార్ ప్లేయర్లు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్​ కూడా ఈ సారి అందుబాటులోకి వస్తాడో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.

అయితే గతంలో మార్కస్ స్టోయినిస్‌ను తుది జట్టులోకి తీసుకుంది క్రికెట్ ఆస్ట్రేలియా. మిచెల్ స్థానంలో స్టోయినిస్ కీ ప్లేయర్​గా అవుతాడని భావించింది. కానీ ఇప్పుడు ఇలా జరగడం వల్ల క్రికెట్ బోర్డు కూడా తలలు పట్టుకుంది. మార్కస్, మిచెల్ మార్ష్ స్థానాల్లో మరో ఇద్దరు ఆల్‌రౌండర్లను వెతికేందుకు ప్రయత్నిస్తున్నారు.

35 ఏళ్ల స్టోయినిస్ ఇప్పటి వరకూ తన కెరీర్​లో 71 వన్డేలు ఆడాడు. అందులో 1495 పరుగులు స్కోర్ చేశాడు. ఆ రన్స్​లో ఓ సెంచరీ, 6 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. ఇక బౌలింగ్‌లోనూ ఈ స్టార్ తన సత్తా చాటాడు. తన కెరీర్​లో ఏకంగా 48 వికెట్లు తీశాడు. కీలక ఇన్నింగ్స్​లో తన ఆల్​రౌండర్ స్కిల్స్​తో జట్టుకు కీలక విజయాలను అందించాడు ఈ స్టార్. స్టోనీస్ ఇలా సడెన్​గా రిటైర్మెంట్ అనౌన్స్ చేయడం క్రీడాభిమానులకు నిరాశకు గురి చేస్తోంది. తన లోటు జట్టుపై ఎఫెక్ట్ చూపించనుందని అంటున్నారు.

Champions Trophy Opening Ceremony :2025 ఛాంపియన్స్ ట్రోఫీ పోరుకు మరికొద్ది రోజుల్లో తెరలేవనుంది. ఇప్పటికే వేదికలు, షెడ్యూల్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB), ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్ (ICC) ప్రకటించాయి. ఇప్పుడు ప్రారంభ వేడుకలకు సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి 16న లాహోర్ ఫోర్ట్‌కు సమీపంలోని చారిత్రక ప్రదేశం హుజూరీ బాగ్‌లో ఆ వేడుకలు జరుగుతాయని తెలిపాయి. వివిధ క్రికెట్ బోర్డులకు చెందిన అధికారులు, సెలబ్రిటీలు, దిగ్గజ క్రికెటర్లు, ప్రభుత్వ ప్రతినిధులు సహా పలువురు ముఖ్యమైన అతిథులను వేడుకకు ఆహ్వానించనున్నారు.

రిటైర్‌మెంట్‌పై ప్లాన్స్​లో రోహిత్​! ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత వన్డే, టెస్టులకు బైబై!

ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్స్​ బుకింగ్ షురూ- ధర ఎంత? ఎలా కొనాలి?

ABOUT THE AUTHOR

...view details