Rohit Sharma Eknath Shinde:టీ 20 ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, యశస్వీ జైశ్వాల్ శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేను కలిశారు. ముంబయిలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం వర్షలో టీ20 ఛాంపియన్లు శిందేను కలిశారు. భారత క్రికెటర్లకు స్వాగతం పలికిన సీఎం ప్లేయర్లను అభినందించారు. వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు. ప్రపంచకప్ విశేషాలను కెప్టెన్ రోహిత్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచకప్‌లో తమ అనుభవాలు, స్వదేశంలో లభించిన అపూర్వ స్వాగతం గురించి ఏక్‌నాథ్ శిందేకు వివరించారు. అనంతరం సీఎం శిందే ఆటగాళ్లను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.
వీళ్లే ఎందుకు?కెప్టెన్ రోహిత్ సహా సూర్యకుమార్, శివమ్ దూబే యశస్వీ జైస్వాల్ మహారాష్ట్రకు చెందిన క్రికెటర్లు. వీరంతా దేశవాళీ క్రికెట్లో ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక రోహిత్, సూర్యకుమార్ యాదవ్ ముంబయికి చెందినవారు కాగా, శివమ్ దూబే, యశస్వీ జైశ్వాల్ ఉత్తరప్రదేశ్ నుంచి ముంబయికి వచ్చి స్థిరపడ్డారు. కాగా, ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో భేటీ ముగిశాక ప్లేయర్లంతా శిందేతో కలిసి విధాన్ భవన్‌కు వెళ్లారు.
విధాన్ భవన్లో సత్కారం:విధాన్ భవన్‌లోనూ ప్లేయర్లకు గ్రాండ్ వెల్కమ్ దక్కింది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్లేయర్లను అధికారికంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో సీఎం శిందేతోపాటు, డిప్యూటి సీఎం దేవేంద్ర ఫడణవీస్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రోహిత్ మరాఠీలో మాట్లాడి ఆకట్టుకున్నాడు. 'ముంబయి చా రాజా రోహిత్ శర్మ' అంటూ ఎమ్మెల్యేలు స్లోగన్స్ ఇచ్చారు. ఇక సీఎం శిందేకు రోహిత్ ధన్యవాదాలు తెలిపాడు.