తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్ దిగ్గజానికి కుల్​దీప్ నివాళులు - ఎమోషనలైన స్టార్ స్పిన్నర్ - Kuldeep Yadav Tributes Shane Warne - KULDEEP YADAV TRIBUTES SHANE WARNE

Kuldeep Yadav Tribute To Shane Warne : తన ఆరాధ్య దైవం షేన్‌ వార్న్‌కి టీమ్ఇండియా క్రికెటర్ కుల్​దీప్ యాదవ్​ తాజాగా నివాళులర్పించాడు. ఆయనతో తనకున్న రిలేషన్‌ గురించి తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు.

Kuldeep Yadav Tribute To Shane Warne
Kuldeep Yadav Tribute To Shane Warne (Etv Bharat)

By ETV Bharat Sports Team

Published : Aug 23, 2024, 7:32 PM IST

Kuldeep Yadav Tribute To Shane Warne :మెల్‌బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్ (MCG) వద్ద దివంగత లెజెండరీ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌కి భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నివాళులర్పించాడు. షేన్‌ వార్న్‌ తన ఆరాధ్య దైవమని కుల్దీప్‌ చాలా సందర్భాల్లో చెప్పాడు. వార్న్‌ తన క్రికెట్‌ కెరీర్‌ని ఎలా ప్రభావితం చేశాడో వివరించాడు.

"షేన్ వార్న్ నా ఆరాధ్యదైవం. అతడితో నాకు చాలా బలమైన అనుబంధం ఉంది. వార్నీ గురించి ఆలోచించినప్పుడు నేను ఇప్పటికీ భావోద్వేగానికి గురవుతాను. నేను నా కుటుంబంలో ఒకరిని కోల్పోయినట్లు అనిపిస్తుంది" అన్నాడు.

'వార్న్‌ ప్రోత్సాహం మరువలేనిది'
MCG ఒక ప్రత్యేక ప్రదేశం. వార్న్ అనేక గొప్ప ప్రదర్శనలకు సాక్ష్యంగా నిలిచింది. ముఖ్యంగా పాపులర్‌ బాక్సింగ్ డే టెస్టుల్లో వార్న్‌ పెర్‌ఫార్మెన్స్‌ క్రికెట్‌ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. వార్న్‌కి నివాళులు అర్పించానికి వార్న్ అద్భుత డెలివరీలు చేసిన ప్రదేశంలో నిలబడి, కుల్దీప్ ఆస్ట్రేలియన్ గ్రేట్ నుంచి పొందిన సలహాలు, స్ఫూర్తిని గుర్తు చేసుకున్నాడు.

"2019లో సిడ్నీ టెస్టుకు ముందు నేను భయపడ్డాను. అప్పుడు వార్న్‌ నా దగ్గరకు వచ్చి, నువ్వు ఏలా బౌలింగ్‌ చేస్తావో నాకు తెలియదు, కానీ నువ్వు గ్రౌండ్‌లో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పాడు" అని కుల్​దీప్ ఎమోషనలయ్యాడు. వార్న్ ప్రోత్సాహకరమైన మాటలు తనపై పని చేశాయని, వాటి వల్ల తానున తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాదని, మైదానంలో మెరుగ్గా రాణించానని కుల్​దీప్​ అన్నాడు.

బోర్డర్‌- గావాస్కర్‌ ట్రోఫీపై ఆసక్తి
కొన్ని నెలల్లో జరుగనున్న బోర్డర్-గావాస్కర్‌ ట్రోఫీ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. MCG ఈ టెస్ట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న తరుణంలో కుల్​దీప్ వార్న్‌కి నివాళులు అర్పించాడడం అందరి మెప్పును పొందుతోంది. ఇక కుల్​దీప్​ తన ప్రదర్శనల్లో వార్న్ స్ఫూర్తిని కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిపాడు. "ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ అభిమానులు జట్టుకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తారు. వారు బోర్డర్-గావాస్కర్ ట్రోఫీకి, ముఖ్యంగా బాక్సింగ్ డే టెస్ట్ సమయంలో పెద్ద సంఖ్యలో వస్తారని నేను విశ్వసిస్తున్నాను" అని కుల్​దీప్​ చెప్పాడు.

'త్వరలోనే శుభవార్త వింటారు- హీరోయిన్​ను మాత్రం చేసుకోను'- పెళ్లిపై కుల్దీప్ కామెంట్స్​ - Kuldeep Yadav Marriage

'నువ్వు బ్యాటింగ్ చేయడం నేనైతే చూడలేదు'-కుల్దీప్​పై రోహిత్ సెటైర్ - Rohit Sharma Kuldeep Yadav

ABOUT THE AUTHOR

...view details