Koneru Humpy World Rapid Champion :తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అద్భుతమైన ఘనత సాధించింది. ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ర్యాపిడ్ ఛాంపియన్‌గా కోనేరు హంపి నిలిచింది. టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లి విజయం సాధించింది. 2019లోనూ హంపి ఛాంపియన్ అయింది. చైనా గ్రాండ్‌మాస్టర్ జు వెంజున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్‌గా హంపి ఘనత సాధించింది. మరో తెలుగు గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంలో నిలిచింది.
వరల్డ్ ఛాంపియన్‌గా కోనేరు హంపి- తెలుగు గ్రాండ్ మాస్టర్ అరుదైన ఘనత! - KONERU HUMPY WORLD RAPID CHAMPION
కోనేరు హంపి అరుదైన రికార్డ్ - చెెస్ ఛాంపియన్‌షిప్‌గా తెలుగు గ్రాండ్ మాస్టర్
Koneru Humpy World Rapid Champion (Source : IANS)
Published : Dec 29, 2024, 7:52 AM IST
పురుషుల విభాగంలో
తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి అగ్రస్థానంలో ఉన్న భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి చివర్లలో వెనుకబడిపోయాడు. పురుషుల ర్యాపిడ్ ఈవెంట్‌లో 18 ఏళ్ల వోలాదర్ ముర్జిన్ విజేతగా నిలిచాడు. రష్యాకు చెందిన ఈ యువ గ్రాండ్ మాస్టర్ 10 పాయిట్లు సాధించి ఛాంపియన్‌గా అవతరించాడు. అర్జున్ (9 పాయింట్లు) ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.