తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 10:30 AM IST

ETV Bharat / sports

'వర్త్ వర్మ వర్త్​'- ఒక్క మ్యాచ్​తో ట్రోల్స్​కు చెక్- నాకౌట్స్​ అంటే చాలు - IPL 2024

Mitchell Starc IPL 2024: 2024 ఐపీఎల్​లో కేకేఆర్ ఫైనల్​కు చేరింది. సన్​రైజర్స్​తో మంగళవారం జరిగిన మ్యాచ్​లో కేకేఆర్ 8 వికెట్లతో నెగ్గింది. ఈ విజయంలో పేసర్ స్టార్క్ కీలక పాత్ర పోషించాడు.​

Mitchell Starc IPL
EtvMitchell Starc IPL (Source: Associated Press)

Mitchell Starc IPL 2024:కోల్​కతా నైట్​రైడర్స్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ 2024 ఐపీఎల్ ప్రారంభం కాకముందు నుంచే సంచలనంగా మారాడు. గతేడాది డిసెంబర్​లో జరిగిన వేలంలో రూ.24.75 కోట్లకు అమ్ముడైన స్టార్క్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా నిలిచాడు. దీంతో అతడిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

కానీ, స్టార్క్​ ఈ సీజన్​ లీగ్​ దశలో పెద్దగా ఆకట్టుకోలేదు. ఏకంగా 11+ ఏకనమీతో పరుగులు సమర్పించుకున్నాడు. తీనిన వికెట్లు (12) కూడా తక్కువే. ఈ నేపథ్యంలో స్టార్క్​కు జట్టులో స్థానం కూడా దండగే! అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ, క్వాలిఫయర్- 1లో సన్​రైజర్స్​పై సత్తా చాటాడు. ఒక్క మ్యాచ్​తో తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాడు.

ఒక్క మ్యాచ్​తో వర్త్​: అహ్మదాబాద్ వేదికగా మంగళవారం సన్​రైజర్స్​తో జరిగిన మ్యాచ్​లో స్టార్క్ ప్రత్యర్థులపై పైచేయి సాధించాడు. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్​రైజర్స్​కు షాక్​ ఇచ్చాడు. భీకర ఫామ్​లో ఉన్న ట్రావిస్ హెడ్ (0)ను సూపర్ యార్కర్​తో క్లీన్​బౌల్డ్ చేశాడు. తర్వాత నితీశ్ రెడ్డి (9), షహబాజ్ అహ్మద్ (0)ను కూడా పెవిలియన్ చేర్చి పవర్ ప్లేలోనే సన్​రైజర్స్​ను గట్టిదెబ్బ కొట్టాడు. దీంతో సన్​రైజర్స్ డిఫెన్స్​లో పడింది. ఫలితంగా క్రమంగా వికెట్లు కోల్పోయి తక్కువ స్కోర్​కే పరిమితమైంది. ఇక స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ అలవోకగా ఛేదించి ఫైనల్​కు దూకుకెళ్లింది. ఇలా అసలైన మ్యాచ్​లో సత్తా చాటిన స్టార్క్ రూ.25 కోట్లకు వర్త్ అనిపించాడని ఫ్యాన్స్ అంటున్నారు.

నాకౌట్స్​లో తగ్గేదేలే: టోర్నీ ఏదైనా, లీగ్ దశలో పెద్దగా ప్రభావం చూపించని స్టార్క్ నాకౌట్​ మ్యాచ్​ల్లో మాత్రం అదరగొట్టేస్తాడు. తాజాగా క్వాలిఫయర్- 1లో సన్​రైజర్స్​పై ప్రదర్శనే ఇందుకు ఉదాహరణ. ఈ మ్యాచ్​లో మూడు కీలక వికెట్లు తీసి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గతేడాది భారత్​తో జరిగిన వరల్డ్​కప్ ఫైనల్​లోనూ స్టార్క్ తన మార్క్ చూపించాడు.

మెగాటోర్నీ లీగ్ దశలో పెద్దగా రాణించని స్టార్క్, ఫైనల్​లో రెచ్చిపోయాడు. మూడు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాకు బ్రేక్ ఇచ్చాడు. ఇందులో ఓపెనర్ శుభ్​మన్ గిల్ (4), కేఎల్ రాహుల్ (66 పరుగులు) రెండు కీలక వికెట్లు దక్కించుకున్నాడు. దీంతో స్టార్క్ లీగ్ మ్యాచ్​ల్లో ఆడపోయినా, 'నాకౌట్స్​ అంటే రెచ్చిపోతాడు', 'అసలైన టైమ్​లో ఆదుకుంటాడు' అంటూ నెటిజన్లు ప్రశంసింస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details