Sunil Narine IPL 2024:కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ లఖ్‌నవూపై విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో నరైన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే బౌండరీలే లక్ష్యంగా లఖ్‌నవూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఏకంగా 228.57 స్ట్రైక్ రేట్‌తో 39 బంతుల్లో 81 పరుగులతో సత్తా చాటాడు. అందులో 6 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నరైన్ ఐపీఎల్లో మరో రికార్డ్ అందుకున్నాడు.
నరైన్ అరుదైన రికార్డ్: ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ ఐపీఎల్లో మరో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో అటు బ్యాటింగ్‌లో 1500+ పరుగులు, ఇటు బౌలింగ్‌లో 150+ వికెట్లు తీసిన మూడో ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. నరైన్ ప్రస్తుతం ఐపీఎల్ కెరీర్లో 1507 పరుగులు, 176 వికెట్లు ఉన్నాయి. నరైన్ కంటే ముందు రవీంద్ర జడేజా (2894 పరుగులు, 160 వికెట్లు, డ్వేన్ బ్రావో (1560 పరుగులు, 183 వికెట్లు) ఈ ఘనత సాధించారు.
ఇక ప్రస్తుత సీజన్‌లో నరైన్ కేకేఆర్‌కు కీలక బ్యాటర్‌గా మారాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో కోల్‌కతాకు మంచి ఆరంభాలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుత సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన నరైన్ 183 స్ట్రైక్ రేట్, 41.91 సగటున ఇప్పటివరకు 461 పరుగులు నమోదు చేశాడు. అందులో 46 ఫోర్లు, 32 సిక్స్‌లు బాదాడు. ఇక అత్యధిక పరుగుల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.