KKR VS DC IPL 2024 :ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య ఏకపక్షంగా పోరు సాగింది. ఇందులో దిల్లీ బ్యాటర్లు తేలిపోగా, 7 వికెట్ల తేడాతో ఆ జట్టును కోల్‌కతా చిత్తుగా ఓడించింది. 16.3 ఓవర్లలోనే 153 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. ఓ అయితే ఈ మ్యాచ్ జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు రేపుతోంది.
మ్యాచ్ మధ్యలో కోల్‌కతా జట్టు ప్లేయర్ హర్షిత్ రాణా చేసిన ఆ తప్పిదం దిల్లీ క్యాపిటల్స్‌కు కలిసి వచ్చింది. దీంతో అభిమానులతో పాటు మాజీలు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోల్‌కతా ఈ మ్యాచ్ గెలిచినప్పటికీ అతడు చేసిన పనిపైనే ఇప్పుడు అందరి ఫోకస్ పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే ?
అలా ఎలా చేశావయ్యా?
తొలుత బ్యాటింగ్‌కు దిగిని దిల్లీ జట్టు దూకుడుగా ఆడేందుకు ప్రయత్నంచినప్పటికీ ఏ మాత్రం వేగం పుంజుకోలేకోపయింది. ఆచీతూచీ ఆడుతూ 153 పరుగుల వరకు నెట్టుకొచ్చింది. అయితే కోల్‌కతా ప్లేయర్ వరుణ్ చక్రవర్తీ వేసిన 9వ ఓవర్‌లో ఓ అనూహ్యమైన ఘటన జరిగింది. ఈ ఓవర్ ఫస్ట్ బాల్‌ను చక్రవర్తీ లెంగ్త్‌లో వేయగా, దాన్ని రిషభ్ పంత్ స్వీప్ షాట్‌గా ఆడాడు.
అయితే ఆ బాల్ మిస్ టైమ్ అయ్యి బ్యాట్ ఎడ్జ్ తాకింది. దీంతో ఓవర్ షార్ట్ ఫైన్ లెగ్ దిశగా గాల్లోకి లేచింది. సరిగ్గా అదే సమయంలో షార్ట్ థర్డ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోల్‌కతా ప్లేయర్ హర్షిత్ రాణా కుడివైపు జరిగి క్యాచ్ అందుకునేందుకు ముందుకొచ్చాడు. కానీ ఈజీగా పట్టగలిలే క్యాచ్‌ను అతడు వదిలేశాడు. దాంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.