Bitcoin Record : అమెరికా తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. చరిత్రలోనే తొలిసారిగా గురువారం లక్ష డాలర్ల మార్క్‌ను దాటింది. తాజాగా ఎస్‌ఈసీ విభాగానికి క్రిప్టో అడ్వయిజర్‌ను అధిపతిగా నియమించడం వల్ల బిట్‌కాయిన్ విలువ మరింత పెరిగింది.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడం దగ్గర నుంచి బిట్‌కాయిన్ విలువ భారీగా పెరిగింది. గత నాలుగు వారాల్లోనే దీని విలువ 45శాతం పెరిగిందంటే దీని దూకుడు అర్థం చేసుకోవచ్చు. క్రిప్టో కరెన్సీ విషయంలో నిబంధనలను సడలిస్తానని ట్రంప్ సంకేతాలు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఇది 1,00,000 డాలర్ల మార్కును క్రాస్ చేసింది. ఒక దశలో అత్యధికంగా 1,00,512ను తాకింది. భవిష్యత్తులో బిట్‌కాయిన్ విలువ 1,20,000 డాలర్లకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ కమిషన్ ఛైర్మన్‌గా పాల్ అట్కిన్కు ట్రంప్ బాధ్యతలు అప్పగించారు. దీంతో క్రిప్టో అనుకూల పాలసీలు వస్తాయన్న అంచనాలతో బిట్‌కాయిన్ విలువ పెరిగింది. పాల్ అట్కిన్ గతంలో జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో కూడా ఎస్‌ఈసీ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత పదవిని వీడాక అమెరికాలో మార్కెట్ నియంత్రణ చాలా తీవ్రంగా ఉందని న్యాయపోరాటం చేశారు. తాజాగా మళ్లీ ఆయనకే ట్రంప్ ఎస్‌ఈసీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్లకు చేరుకుంది.
2009లో చలామణిలోకి వచ్చిన బిట్‌కాయిన్ ధర అప్పుడు జీరోగా ఉంది. 2011 ఫిబ్రవరిలో ఒక డాలరు మార్క్‌ను దాటింది. అలా 2020 నాటికి దీని విలువ 5000 డాలర్లకు చేరుకుంది. 2024లో ఫిబ్రవరిలో 57 వేల డాలర్లుగా ఉన్న బిట్‌కాయిన్ అమెరికా ఎన్నికల రోజున 69,374 డాలర్లుగా ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత 90 వేల మార్క్‌కు చేరింది. నవంబర్ 21న బిట్‌కాయిన్ విలువ 95 వేల డాలర్లకు పెరిగిన బిట్‌కాయిన్ విలువ తాజాగా లక్ష డాలర్ల మార్క్‌ను దాటింది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
ప్రస్తుతం బిట్‌కాయిన్‌తో మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.87,13,272 |
ఇథీరియం | రూ.3,10,002 |
ఇథీరియం | రూ.84.77 |
బైనాన్స్ కాయిన్ | రూ.60,001 |
యూఎస్డీ కాయిన్ | రూ.84.72 |