Khel Ratna Awards 2025: భారత అత్యున్నత క్రీడా పురస్కారం 'ఖేల్ రత్న'లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నలుగురు క్రీడాకారులకు కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది. మను బాకర్ (షూటింగ్), హర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (పారా అథ్లెట్), డి.గుకేశ్ (చెస్) ఖేల్‌రత్నకు ఎంపికయ్యారు. ఈ అత్యున్నత అవార్డులను జనవరి 17న ఉదయం 11గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రదానం చేయనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
మను బాకర్
షూటింగ్
హర్మన్‌ప్రీత్ సింగ్
హాకీ
ప్రవీణ్ కుమార్
పారా అథ్లెట్
డి.గుకేశ్
చెస్
అర్జున అవార్డులు కూడా ఈ ఏడాది అర్జున అవార్డులు కూడా కేంద్రం ప్రకటించింది. మొత్తం 32 మందిని అర్జున అవార్డుకు ఎంపిక చేసింది. అందులో 17మంది పారా అథ్లెట్లు ఉన్నారు. అందులో తెలంగాణ పారాఅథ్లెట్ దీప్రి జివాంజి కూడా అర్జున అవార్డుకు ఎంపికైంది.