తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోచింగ్ స్టాఫ్​పై BCCI ఫోకస్- బ్యాటింగ్ కోచ్​గా మాజీ కెప్టెన్! - INDIA BATTING COACH

టీమ్ఇండియా కోచింగ్ స్టాఫ్​పై BCCI ఫోకస్- త్వరలోనే కొత్త బ్యాటింగ్ కోచ్

India Batting Coach
India Batting Coach (Source : Getty Images, AP)

By ETV Bharat Sports Team

Published : Jan 16, 2025, 5:34 PM IST

Team India Batting Coach :టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్​ వరుసగా రెండు టెస్టు సిరీస్​ల్లో విఫలం అయ్యింది. ​సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా కుర్రాళ్లు సైతం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్​ల్లో పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో బీసీసీఐ భారత జట్టుకు కొత్త బ్యాటింగ్‌ కోచ్‌ను నియమించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియాకు బ్యాటింగ్ కోచ్​గా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ముందుకొచ్చాడు.

టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్​ కోసం సెర్చింగ్ ప్రారంభించిందన్న ఓ పోస్టుకు పీటర్సన్ స్పందించాడు. 'ఐయామ్ రెడీ' అని అర్థం వచ్చేలా రిప్లై ఇచ్చాడు. మరోవైపు భారత దిగ్గజాల్లోనే ఒకరిని జట్టుకు బ్యాటింగ్ కోచ్​గా నియమించాలనేది బీసీసీఐ ఆలోచన అని వార్తలు వస్తున్నాయి. మరి పీటర్సన్ విషయంలో మేనేజ్​మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

సెట్ అవుతాడా?
అయితే పీటర్సన్​కు టీమ్ఇండియాతో మంచి అనుబంధం ఉంది. అతడికి ఐపీఎల్​లో ఆడిన అనుభవం కూడా ఉంది. తన కెరీర్‌లో 104 టెస్టులు ఆడిన పీటర్సన్ 8వేలకుపైగా పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు ఊన్నాయి. 136 వన్డేలు ఆడిన అతడు 40.73 సగటుతో 4,440 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లోనూ రాణించాడు. మొత్తం 37 మ్యాచ్‌లు ఆడిన కెవిన్ 1,176 పరుగులు చేశాడు. అయితే ఇప్పటి వరకు అతడికి కోచింగ్‌ అనుభవం లేకపోవడం మైనస్‌గా మారే అవకాశం లేకపోలేదు. కాగా, 2018లో పీటర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

కోచింగ్ స్టాఫ్ ఇదే!
2024 టీ20 వరల్డ్​కప్​ తర్వాత మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ టీమ్ఇండియా హెడ్ కోచ్​గా నియమితుడయ్యాడు. అతడికి అసిస్టెంట్ కోచ్​లుగా రియాన్ టెన్ డెష్కటే, అభిషేక్ నాయర్ ఎంపికయ్యారు. సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ భారత జట్టుకు బౌలింగ్​ కోచ్​గా కొనసాగుతున్నాడు. ఇదీ టీమ్ఇండియా కోచింగ్ స్టాఫ్. ఇందులో రియాన్ టెన్ డెష్కటే, అభిషేక్ నాయర్ హెడ్​ కోచ్​ గంభీర్​కు అసిస్టెంట్ కోచ్​లుగా ఉన్నారు.

కానీ, జట్టుకు ఇప్పటివరకు ఫుల్​ టైమ్ బ్యాటింగ్ కోచ్ లేకపోవడం గమనార్హం. ఇటీవల ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ లేవనెత్తాడు. ఆసీస్ పర్యటనలో గబ్బా టెస్టులో గంట వ్యవధిలోపే టీమ్ఇండియా టాపార్డర్ కుప్పుకూలడం వల్ల మంజ్రేకర్ భారత కోచింగ్ స్టాఫ్​పై ఆందోళన వ్యక్తం చేశాడు. టీమ్ఇండియాలో బ్యాటింగ్ కోచ్ పాత్రను పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నాడు.

'టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ ఎవరు- అసలు వాళ్లను గైడ్ చేస్తున్నదెవరు?'

సపోర్టింగ్ స్టాఫ్​పై గంభీర్ ఫోకస్- కొత్త బ్యాటింగ్ కోచ్​గా సీనియర్! - Team India Batting Coach

ABOUT THE AUTHOR

...view details