Keshav Maharaj Ayodhya Wishes:అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కోసం రామజన్మభూమి అందంగా ముస్తాబైంది. ఈరోజు (జనవరి 22) మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా రామభక్తులు, ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ రామమందిర ప్రారంభం సందర్భంగా ఆ దేశంలో ఉన్న భారతీయ హిందూ కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపాడు.
'అందరికీ నమస్తే, అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సం సందర్భంగా సౌతాఫ్రికాలో ఉన్న నా భారతీయులందరికీ శుభాకాంక్షలు. అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలగాలి. జై శ్రీరామ్' అని మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే కేశవ్ మహరాజ్ భారతీయ మూలాలున్న సౌతాఫ్రికా పౌరుడు. అతడి పూర్వికులు (తాత) ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్‌పుర్‌కు చెందినవారు. కేశవ్ భార్య లెరిషా మున్సామీ ఓ కథకళి డ్యాన్సర్. ఇక రామమందిరాన్ని సందర్శించడానికి తను కూడా ఎదురుచూస్తున్నట్లు కేశవ్ తెలిపాడు. ఈసారి భారత్‌కు వచ్చినప్పుడు కచ్చితంగా అయోధ్య మందిరాన్ని సందర్శిస్తానని కేశవ్ ఓ సందర్భంలో చెప్పాడు. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడేందుకు భారత్ వచ్చిన కేశవ్, కేరళలోని పద్మనాభస్వామి ఆలయాన్నికి వెళ్లాడు.
గతంలో సౌతాఫ్రికా ఆడిన మ్యాచ్‌ల్లో కేశవ్ బ్యాటింగ్‌కు వచ్చే సమయంలో పలుమార్లు రాముడి పాటలు ప్లే చేశారు. రీసెంట్గా సౌతాఫ్రికా- భారత్ టెస్టు, వన్డే సిరీస్‌లోనూ ఆదిపురుష్ సినిమాలోని 'సీతా రామ్' పాట ప్లే చేశారు. 'నువ్వు వచ్చినప్పుడు రాముడి పాట ప్లే చేస్తున్నారు' అని టీమ్ఇండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, కేశవ్‌తో చెప్పాడు. దీంతో కేశవ్ కూడా నవ్వుతూ అవునని బదులిచ్చాడు.