తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్టుల్లో కేన్ దూకుడు - రెండు ఇన్నింగ్స్​లో మూడు రికార్డులు - కేన్​ విలియమ్సన్​ టెస్ట్ రికార్డులు

Kane Williamson Record In Test : సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్​లో న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్​ విలియమ్సన్​ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. ఇంతకీ అవేంటంటే ?

Kane Williamson Record
Kane Williamson Record

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 4:26 PM IST

Updated : Feb 6, 2024, 6:19 PM IST

Kane Williamson Record In Test : న్యూజిలాండ్‌ స్టార్‌ క్రికెటర్​ కేన్‌ విలియమ్సన్‌ తాజాగా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు (118), (109) చేసి ట్విన్‌ సెంచరీలు సాధించిన ఐదో న్యూజిలాండ్‌ ప్లేయర్​గా రికార్డుల్లోకెక్కాడు.

మరోవైపు సెకెండ్‌ ఇన్నింగ్స్​లో చేసిన శతకంతో టెస్ట్‌ సెంచరీల సంఖ్యను 31 కి పెంచుకున్న కేన్‌, అత్యధిక సెంచరీలు (అన్ని ఫార్మాట్లలో కలిపి 44 సెంచరీలు) చేసిన యాక్టివ్‌ ప్లేయర్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటికే ఈ లిస్ట్​లో 80 సెంచరీలతో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్‌ కోహ్లీ టాప్ పొజిషన్​లో ఉండగా, ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్‌ వార్నర్‌ (49 సెంచరీలు), జో రూట్‌ (46), రోహిత్‌ శర్మ (46), స్టీవ్‌ స్మిత్‌ (44)లు ఆ తర్వాతి స్థానాలను కైవసం చేసుకున్నారు.

దీంతో పాటు టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 31 సెంచరీలు (170 ఇన్నింగ్స్‌ల్లో) పూర్తి చేసిన రెండో ప్లేయర్​గానూ కేన్​ చరిత్రకెక్కాడు. ఇప్పటికే ఈ లిస్ట్​లో సచిన్‌ , (165 ఇన్నింగ్స్‌ల్లో) టాప్​ పొజిషన్​లో ఉండగా, స్టీవ్‌ స్మిత్‌ విలియమ్సన్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానాన్ని సాధించాడు.

Newzealand Vs South Africa Test :ఇక మౌంట్‌ మాంగనూయ్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్‌లో న్యూజిలాండ్‌ జట్టు విజయ తీరాలకు చేరువ కానుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 528 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.

వరుస సెంచరీలతో కేన్​ న్యూజిలాండ్​కు భారీ స్కోర్ అందించగా, యంగ్​ ప్లేయర్​ రచిన్‌ రవీంద్ర తొలి ఇన్నింగ్స్‌లోనే డబుల్‌ సెంచరీ (240) చేసి అందరినీ అబ్బురపరిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 511 పరుగులకు ఆలౌట్‌ కాగా, సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలింది. భారీ లీడ్‌తో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ కొనసాగిస్తున్న కివీస్‌, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు స్కోర్​ చేసింది.

ఐసీసీ ర్యాంకింగ్స్​ రిలీజ్​ - కేన్ మామనే టాప్​ - రోహిత్, కోహ్లీ పొజిషన్ ఏంటంటే ?

ENG vs NZ: టెస్టు​ల్లో కేన్​ మామ కొత్త రికార్డు.. అతడే నంబర్​ వన్​!

Last Updated : Feb 6, 2024, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details