kane williamson Century Record : న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ చరిత్ర సృష్టించాడు. ఒక వేదికగా వరుసగా ఐదు సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌గా రికార్డు సాధించాడు. ఇంగ్లాండ్‌తో హామిల్టన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడం ద్వారా విలియమ్సన్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో దురదృష్టకర రీతిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్న విలియమ్సన్, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అదరగొట్టాడు. 204 బంతుల్లో 20 ఫోర్లు, సిక్స్ సాయంతో 156 పరుగులు బాదాడు.
హామిల్టన్‌లో వరుసగా ఐదు సెంచరీలు
హామిల్టన్ వేదికగా కేన్ విలియమ్సన్ ఐదు సెంచరీలు చేశాడు. 2019లో బంగ్లాదేశ్‌పై ద్విశతకం నమోదు చేసిన కేన్ మామ, అదే ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన తర్వాతి మ్యాచ్‌లో 104 రన్స్ బాదాడు. 2020లో విండీస్ పై 251, 2024లో సౌతాఫ్రికాపై 133 పరుగులు సాధించాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో 156 రన్స్ చేశాడు.
యావరేజ్లో ఐదో ప్లేస్‌లో
ఇక ఒకే వేదికగా అత్యధిక టెస్ట్ యావరేజ్ కలిగిన బ్యాటర్ల జాబితాలోనూ కేన్ మామ ఐదో స్థానంలో నిలిచాడు. హామిల్టన్‌లో విలియమ్సన్ సగటు 97.69గా ఉంది. ఇక్కడ కేన్ 12 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1,563 పరుగులు చేశాడు. ఒకే వేదికపై అత్యధిక సగటు కలిగిన బ్యాటర్ల జాబితాలో డాన్ బ్రాడ్‌మన్, వీవీఎస్ లక్ష్మణ్, గర్‌ఫీల్డ్ సోబెర్స్, జహీర్ అబ్బాస్ వంటి దిగ్గజాలు విలియమ్సన్ కన్నా ముందున్నారు.
ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్
హామిల్టన్‌లో సెంచరీతో కదం తొక్కిన కేన్ విలియమ్సన్‌కు ప్రేక్షకులు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అయితే ఈ మ్యాచ్‌పై కివీస్ పట్టు బిగించింది. ఇప్పటికే 550 ప్లస్ రన్స్ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ టామ్ లాథమ్(63), మిచెల్ సాంట్నర్(76) హాఫ్ సెంచరీలతో రాణించగా, కేన్ విలియమ్సన్(44) త్రుటిలో అర్ధశతకాన్ని చేజార్చుకున్నాడు. బంతిని వికెట్లపైకి తన్నుకొని వెనుదిరిగాడు.
అనంతరం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే చేపచుట్టేసింది. మ్యాట్ హెన్రీ నాలుగు, విల్ ఓ రూర్కీ, మిచెల్ సాంట్నర్ చెరో మూడు వికెట్లు తీశారు. దీంతో న్యూజిలాండ్‌కు తొలి ఇన్నింగ్స్ లో 204 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 5 వికెట్లకు 361 పరుగులు చేసి మూడో టెస్టుపై పట్టు సాధించింది.
చేసింది 3 పరుగులే అయినా బిగ్ రికార్డ్ బ్రేక్ - ద్రవిడ్‌ను అధిగమించిన కోహ్లీ!
ఫస్ట్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ - బుమ్రా ఖాతాలో మరో రికార్డు