AUS vs IND 3rd Test Rohith Sharma Fire on AkashDeep : బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతోన్న మూడో టెస్టులో టీమ్ ఇండియా కష్టాల్లో పడింది. బౌలింగ్‌లో బుమ్రా మినహా ఇంకెవవరూ పెద్దగా రాణించలేదు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే మైదానంలో ఎంతో అసహనంగా కనిపించాడు. భారత్ బౌలింగ్ చేస్తున్నప్పుడు, ఆకాశ్ దీప్ పిచ్‌కు అవతల విసిరాడు. వెంటనే ఫీల్డ్ అంపైర్ వైడ్‌గా ప్రకటించాడు. దీంతో హిట్ మ్యాన్ ఒక్క సారిగా ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఆసీస్ బ్యాటర్ అలెక్సీ కేరీ బ్యాటింగ్ చేస్తుండగా, 114వ ఓవర్‌ను ఆకాశ్ సంధించాడు. వికెట్లకు చాలా దూరంగా బంతిని విసిరాడు. దీనిని అందుకోవడానికి వికెట్ కీపర్ రిషభ్ పంత్ చాలా శ్రమించాల్సి వచ్చింది. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హిట్‌మ్యాన్ సహనం కోల్పోయి వెంటనే ఆకాశ్‌ను ఉద్దేశించి, 'నీ బుర్రలో ఏమైనా ఉందా?' అని అన్నాడు. ఇవన్నీ స్టంప్ మైక్స్‌లో రికార్డు అయ్యాయి.
Rohit Sharma & Stump-mic Gold - the story continues... 😅#AUSvINDOnStar 👉 3rd Test, Day 3 LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/vCW0rURX5q
— Star Sports (@StarSportsIndia) December 16, 2024
చరిత్ర సృష్టించిన విలియమ్సన్ - ఒకే వేదికపై వరుసగా 5 సెంచరీలు
బుమ్రాపై అభ్యంతరకర వ్యాఖ్యలు - సారీ చెప్పిన మహిళా కామెంటేటర్