తెలంగాణ

telangana

ETV Bharat / sports

పరుగుల కంటే ఓవర్లే ఎక్కువ- రూట్​పై శాస్త్రి ఫన్నీ కామెంట్స్

Joe Root Bowling vs India: టీమ్ఇండియా మాజీ ప్లేయర్, సీనియర్ కామెంటేటర్ రవిశాస్త్రి ఇంగ్లాండ్​ ప్లేయర్​ రూట్​పై ఫన్నీ కామెంట్స్​ చేశాడు.

Joe Root Bowling vs India
Joe Root Bowling vs India

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 5:42 PM IST

Updated : Feb 17, 2024, 5:56 PM IST

Joe Root Bowling vs India:ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ భారత్​తో జరుగుతున్న టెస్టు సిరీస్​లో బ్యాట్​తో కంటే బంతితో రాణిస్తున్నాడు. ప్రస్తుత సిరీస్​లో ఇప్పటివరకు రూట్ 89 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అందులో 3.25 ఎకనమీతో 7 కీలక వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో బ్యాట్​తో అంతగా రాణించలేకపోతున్న రూట్​ను కామెంటేటర్ రవిశాస్త్రి ఫన్నీగా ట్రోల్ చేశాడు.

'జోరూట్ ఈ సిరీస్​లో 89 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అంటే ఈ సిరీస్​లో అతడు బాదిన పరుగుల కంటే ఈ సంఖ్య ఎక్కువ' అని మ్యాచ్ జరుగుతుండగా అన్నాడు. దీంతో అతడి కో- కామెంటేటర్స్​తోపాటు ఆడియెన్స్​కూడా నవ్వుకున్నారు. అయితే ఈ సిరీస్​లో రూట్ ఐదు ఇన్నింగ్స్​ల్లో కలిపి 70 పరుగులు మాత్రమే చేశాడు. అతడి సగటు 14గా ఉంది. ఒక్కసారి కూడా రూట్ 30 పరుగుల మార్క్ టచ్ చేయలేదు. అయితే టెస్టుల్లో ఓ గడ్డపై అయినా అద్భుతంగా రాణించే రూట్ భారత్​తో సిరీస్​లో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు.

ఇక ప్రస్తుత మ్యాచ్​లోనూ తొలి ఇన్నింగ్స్​లో ఒక వికెట్ దక్కించుకున్న రూట్, రెండో ఇన్నింగ్స్​లో కీలకమైన రోహిత్ శర్మను ఔట్ చేశాడు. ఇక ప్రస్తుత సిరీస్​లో రూట్ అత్యధిక ఓవర్లు బౌలింగ్ చేసిన మూడో ఇంగ్లాండ్​ ప్లేయర్​గా నిలిచాడు. టామ్ హార్ట్లీ, రెహాన్ అహ్మద్ ఈ లిస్ట్​లో అతడి కంటే ముందున్నారు.

అలా ఆడడం ఎందుకు?అయితే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్​లో రూట్ 18 పరుగులకే పెవిలియన్ చేరాడు. బుమ్రా బౌలింగ్​లో రివర్స్ ర్యాంప్ షాట్​ ఆడే క్రమంలో సెకండ్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న యశస్వి జైస్వాల్‌కు దొరికిపోయాడు. అయితే బజ్​బాల్ క్రికెట్ ఆడే క్రమంలో రూట్ ఇలా ఔటవ్వడం రెండోసారి. దీంతో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ దీనిపై స్పందించాడు. బుమ్రా లాంటి అత్యుత్తమ బౌలర్​ ఓవర్లో అలాంటి షాట్ ఆడడం ఎందుకని కుక్ అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

ఆ షాట్​ వల్ల జో రూట్ ఔట్​ - తొలి సారి మాత్రం అలా!

రాజ్​కోట్​లో పట్టు బిగించిన 'భారత్'- భారీ ఆధిక్యం దిశగా టీమ్ఇండియా

Last Updated : Feb 17, 2024, 5:56 PM IST

ABOUT THE AUTHOR

...view details