JayShah on Domestic Cricket : గాయాలపాలై ఆటకు దూరంగా ఉన్నవారు మళ్లీ నేషనల్ టీమ్‌లోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోసారి ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలంటే డొమిస్టిక్ క్రికెట్ అత్యుత్తమ వేదిక అని పేర్కొన్నారు. అయితే కోహ్లీ, రోహిత్, బుమ్రా వంటి వారికి మాత్రం కొన్ని మినహాయింపులు ఉంటాయని అన్నారు. వారిని కూడా ఆడాలని కోరడంలో అర్థం లేదని చెప్పారు.
రంజీ ట్రోఫీ బరిలో షమీ(Shami Ranji Trophy) - సర్జరీ చేయించుకుని కోలుకున్న టీమ్ ఇండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టేందుకు రెడీ అయ్యాడు. రంజీ ట్రోఫీలో బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు ఇప్పటికే వెల్లడించాడు. తొలి రెండు మ్యాచుల్లో అతడు ఆడే ఛాన్స్ ఉంది. యూపీ (అక్టోబర్ 11న) లేదా బిహార్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఇకపోతే న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ నాటికి (అక్టోబర్ 19న తొలి టెస్టు) రెడీ అవ్వాలనే లక్ష్యంతో షమీ ఉన్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన (నవంబర్ రెండో వారం) కూడా ఉంది. ఈ పర్యటనలతో జాతీయ జట్టులోకి అడుగుపెట్టాలని అతడు భావిస్తున్నాడు. అందుకే ఈ రంజీ ట్రోఫీలో తన ప్రదర్శన, ఫిట్నెస్ చూపించి సత్తా చాటాలనుకుంటున్నాడు.
Rinku Singh Duleep Trophy : సెప్టెంబర్ 5 నుంచి దులీప్ ట్రోఫీ 17వ ఎడిషన్ ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నీకి యంగ్ బ్యాటర్ రింకూ సింగ్‌ను ఎంపిక చేయలేదు. ఇషాన్ కిషన్, శ్రేయస్, సూర్య, యశస్వి తదితరులను మాత్రం సెలెక్ట్ చేశారు. దీంతో రింకూ సింగ్‌ను ఎంపిక చేయకపోవడంపై సోషల్ మీడియాలో అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారి తీసింది. అయితే దీనిపై రింకూ సింగ్ స్పందించాడు. గత సీజన్‌లో తాను గొప్ప ప్రదర్శన చేయకపోవడం వల్లే తనకు ఇప్పుడు అవకాశం దక్కలేదని అన్నాడు.