తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫోన్‌ నంబర్ అడిగిన లేడీ ఫ్యాన్‌ - నీరజ్‌ చోప్రా ఏం చేశాడో తెలుసా? - Neeraj Chopra Lady Fan Following

Javelin thrower Neeraj Chopra Lady Fan Following : తన ఆట తీరుతో ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్న నీరజ్‌ చోప్రాను ఓ లేడీ ఫ్యాన్‌ ఫోన్‌ నంబర్ అడిగింది. అయితే అతడు స్పందించిన తీరు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. మీరు ఆ వీడియో చూశారా?

source  ANI
Javelin thrower Neeraj Chopra Lady Fan Following (source ANI)

By ETV Bharat Sports Team

Published : Sep 17, 2024, 10:42 AM IST

Javelin thrower Neeraj Chopra Lady Fan Following : భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో దేశానికి రెండు మెడల్స్​ తెచ్చి పెట్టాడు. అలానే భారీ స్థాయిలో అభిమానులను కూడా సొంతం చేసుకున్నాడు. అయితే అతడి క్రేజ్ స్వదేశాని మాత్రమే పరిమితం కాలేదు. విదేశాల్లోనూ అతడికి భారీగా అభిమానులు ఉన్నారు. వారిలో లేడీ ఫ్యాన్స్​ కూడా ఉండటం విశేషం. తాజాగా నీరజ్ చోప్రా ఆటోగ్రాఫ్ కోసం అభిమానులు ఎదురు చూసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక లేడీ ఫ్యాన్ అయితే నీరజ్‌ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకొని, ఫోన్ నంబర్ కూడా అడగడం ఆ వీడియోలో కనిపించింది.

ఆ వీడియోలో పలువురు ఫారెన్ లేడీస్​ నీరజ్‌తో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. అయితే వారిలో ఒక అమ్మాయి మాత్రం, మీ ఫోన్ నంబర్ ఇస్తారా? అంటూ అడిగింది. కానీ ఆమె అభ్యర్థనను నీరజ్ చోప్రా సున్నితంగా తిరస్కరించినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీసిందో క్లారిటీ లేదు.

Neeraj Chopra Diamond League : కాగా, ఈ సన్నివేశం బెల్జియంలోని బ్రస్సెల్స్‌ వేదికగా రీసెంట్​గా జరిగిన డైమండ్‌ లీగ్ ఫైనల్​లో చోటు చేసుకొని ఉంటుందని కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ లీగ్‌ ఫైనల్​ పోరులో మరోసారి నీరజ్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ పోటీలో నీరజ్ అత్యుత్తమంగా 87.86 మీటర్ల దూరం బల్లెం విసిరాడు. అయితే కేవలం ఒక్క సెంటీమీటర్‌ తేడాతో అగ్ర స్థానాన్ని దక్కించుకోలేకపోయాడు. గ్రెనడాకు చెందిన పీటర్స్‌ అండర్సన్‌ 87.87 మీటర్ల దూరం ఈటెను విసిరి ఛాంపియన్‌గా అవతరించాడు.

ఇక తన మూడో ప్రయత్నంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన నీరజ్‌ చోప్రా ఆఖరి ప్రయత్నంలో 86.46 మీటర్ల దూరం బల్లెంను విసిరాడు. అంతకుముందు జరిగిన డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లోనూ నీరజ్‌ చోప్రా రెండో స్థానంలోనే నిలిచాడు. ఇకపోతే పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ రెండో స్థానంలో నిలిచి సిల్వర్​ మెడల్ దక్కించుకున్నాడు నీరజ్. అంతకుముందు టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు.

నీరజ్‌ చోప్రా ఎక్స్​ రే పోస్ట్- బల్లెం వీరుడి గాయంపై మను రియాక్షన్ వైరల్ - Neeraj Chopra Manu Bhaker

పారిస్ ఒలింపిక్స్ తర్వాత నీరజ్ చోప్రా బ్రాండ్ వ్యాల్యూ ఎంత పెరిగిందంటే? - Neeraj Chopra Brand Value

ABOUT THE AUTHOR

...view details